AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఐపీఎల్ 2026 సమరానికి చిన్నస్వామి స్టేడియం రెడీ.. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ అంచనా జట్లు ఇవే

IPL 2026 : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పటిష్టమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య తొలి ఐపీఎల్ మ్యాచ్ నేడు జరగనుంది. ఈ ఆరంభ మ్యాచ్‌లో ఇరు జట్లు తమ కీలక బౌలర్లు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి.

IPL 2026 : ఐపీఎల్ 2026 సమరానికి చిన్నస్వామి  స్టేడియం రెడీ.. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ అంచనా జట్లు ఇవే
Rcb Vs Srh
Rakesh
|

Updated on: Mar 28, 2026 | 7:43 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 (IPL 2026) రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. నేడు (మార్చి 28) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పటిష్టమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ పోరుపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 10 నెలల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో టాప్ లెవల్ క్రికెట్ జరుగుతుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ ఆరంభ మ్యాచ్‌లో ఇరు జట్లు తమ కీలక బౌలర్లు లేకుండానే బరిలోకి దిగుతుండటం గమనార్హం.

బౌలింగ్ కష్టాల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ

గత సీజన్ విజేతగా బరిలోకి దిగుతున్న ఆర్సీబీకి తొలి మ్యాచ్‌లోనే గాయాలు తలనొప్పిగా మారాయి. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఆరంభ మ్యాచులకు దూరం కాగా, యశ్ దయాల్ ఈ సీజన్ మొత్తానికే అందుబాటులో లేడు. శ్రీలంక బౌలర్ నువాన్ తుషార ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్ అవ్వడం ఆ జట్టును మరింత దెబ్బతీసింది. దీంతో బౌలింగ్ భారాన్ని భువనేశ్వర్ కుమార్, సుయశ్ శర్మ, జాకబ్ డఫీ మోయాల్సి ఉంటుంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్‌లపైనే జట్టు ఆశలు పెట్టుకుంది.

కొత్త కెప్టెన్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ వేట

సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఈసారి కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలి సగం మ్యాచులకు అందుబాటులో లేకపోవడంతో, టీ20 వరల్డ్ కప్ హీరో ఇషాన్ కిషన్ జట్టు పగ్గాలు చేపట్టాడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వంటి విధ్వంసకర ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్‌లో హెన్రిక్ క్లాసెన్ ఉండటం ఆ జట్టుకు కొండంత బలం. సలీల్ అరోరా, అనికేత్ వర్మ వంటి యువ ఆటగాళ్లు ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. బౌలింగ్‌లో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ కీలక పాత్ర పోషించనున్నారు.

ఇరు జట్ల అంచనా ప్లేయింగ్ 11 :

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB):

విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్ లేదా టిమ్ డేవిడ్, రోమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయశ్ శర్మ, జాకబ్ డఫీ, రసిఖ్ సలామ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH):

ఇషాన్ కిషన్ (కెప్టెన్/వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్ లేదా ఇషాన్ మలింగా, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, హర్ష దూబే, బ్రైడన్ కార్సే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా