AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs DC: ఒక్క మ్యాచ్‌.. బద్దలైన రికార్డులు ఎన్నో తెలుసా?

ఐపీఎల్ 2026లో RCB vs DC మ్యాచ్ రికార్డుల వర్షం కురిపించింది. విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 9,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అత్యల్ప పవర్‌ప్లే స్కోరు, పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు కోల్పోయి చెత్త రికార్డులు మూటగట్టుకుంది.

RCB vs DC: ఒక్క మ్యాచ్‌.. బద్దలైన రికార్డులు ఎన్నో తెలుసా?
Rcb Vs Dc Match
SN Pasha
|

Updated on: Apr 28, 2026 | 6:00 AM

Share

ఐపీఎల్‌ 2026లో భాగంగా సోమవారం జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో పలు కీలక రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించడమే కాకుండా, ఐపీఎల్ చరిత్రలో కొన్ని అరుదైన మైలురాళ్లను కూడా అందుకుంది. ఆర్సబీ బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌, జోష్‌ హెజల్‌వుడ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో పాపం డీసీ బ్యాటర్లు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. కేవలం 9 పరుగులకే డీసీ తొలి 6 వికెట్లను కోల్పోయింది. ఈ దెబ్బతో ఆర్సీబీపై ఉన్న 49 పరుగులకు ఆలౌట్‌ మచ్చ తొలగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, అది జరగలేదు. ఆ విషయం పక్కనపెడితే ఈ మ్యాచ్‌లో బ్రేక్‌ అయిన రికార్డులేంటో ఇప్పుడు చూద్దాం..

విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే 9,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకోవడానికి అతనికి ఈ మ్యాచ్‌లో కేవలం 11 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. వాటిని పూర్తి చేసి 15 బంతుల్లో ఒక ఫోర్‌, రెండు సిక్సులతో 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప పవర్‌ప్లే స్కోరు

ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లో ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది. పవర్‌ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప పవర్‌ప్లే స్కోరు.

పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు

పవర్‌ప్లే (మొదటి 6 ఓవర్లు) లోనే ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయింది. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ పవర్‌ప్లేలో ఇన్ని వికెట్లు కోల్పోవడం ఇదే మొదటిసారి. అంతకుముందు 2022లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోవడమే రికార్డుగా ఉండేది.

అత్యంత వేగవంతమైన విజయాల్లో ఒకటి

ఢిల్లీని కేవలం 75 పరుగులకే ఆలౌట్ చేసిన బెంగళూరు, ఆ లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలోనే ఛేదించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో (బంతుల పరంగా) రెండో అతిపెద్ద విజయం. బెంగళూరు ఇంకా 81 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

ఈ సీజన్‌లో అత్యల్ప జట్టు స్కోరు

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన 75 పరుగులు ఇప్పటి వరకు నమోదైన అత్యల్ప స్కోరు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 3.3 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అలాగే భువనేశ్వర్ కుమార్ కేవలం 5 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us