AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసులో సన్‌రైజర్స్ హవా.. వైభవ్ సూర్యవంశీని వెనక్కి నెట్టిన క్లాసెన్

IPL 2026 : ఇప్పటివరకు రాజస్థాన్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 200 పరుగులతో అగ్రస్థానంలో ఉండేవాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను సున్నాకే అవుట్ కావడంతో ఆరెంజ్ క్యాప్ చేజారింది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 224 పరుగులతో మొదటి స్థానానికి చేరుకున్నాడు.

IPL 2026 : ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసులో సన్‌రైజర్స్ హవా.. వైభవ్ సూర్యవంశీని వెనక్కి నెట్టిన క్లాసెన్
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: Apr 14, 2026 | 10:49 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 19వ సీజన్‌లో పోరు రసవత్తరంగా సాగుతోంది. 21వ మ్యాచ్ పూర్తయ్యేసరికి పరుగుల వీరులకు ఇచ్చే ఆరెంజ్ క్యాప్, వికెట్ల వీరులకు దక్కే పర్పుల్ క్యాప్ రేసులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఈ ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇప్పటివరకు టాప్‌లో ఉన్న కుర్రాడు వైభవ్ సూర్యవంశీని వెనక్కి నెట్టి హైదరాబాద్ బ్యాటర్లు రాజసం ప్రదర్శిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత పరుగుల పట్టికలో భారీ మార్పులు వచ్చాయి. ఇప్పటివరకు రాజస్థాన్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 200 పరుగులతో అగ్రస్థానంలో ఉండేవాడు. కానీ, హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను సున్నాకే అవుట్ కావడంతో ఆరెంజ్ క్యాప్ చేజారింది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 5 ఇన్నింగ్స్‌ల్లో 224 పరుగులతో మొదటి స్థానానికి చేరుకున్నాడు. అతని వెంటే మరో ఎస్‌ఆర్‌హెచ్ వీరుడు, కెప్టెన్ ఇషాన్ కిషన్ 213 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. వైభవ్ సూర్యవంశీ 200 పరుగులతో మూడో స్థానానికి పడిపోగా, ఆర్‌సిబి కెప్టెన్ రజత్ పాటిదార్ (195 పరుగులు), రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (184 పరుగులు) ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు.

పర్పుల్ క్యాప్ పోరులో ప్రసిద్ధ్ కృష్ణ అగ్రస్థానం

వికెట్ల వేటలో మాత్రం పెద్దగా మార్పులేమీ జరగలేదు. గుజరాత్ టైటాన్స్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 4 మ్యాచ్‌ల్లోనే 10 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నెంబర్ వన్ స్థానంలో నిలకడగా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లతో రెండో స్థానంలో ఉండి ప్రసీద్‌కు గట్టి పోటీ ఇస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్ 4 మ్యాచ్‌ల్లో 8 వికెట్లతో మూడో స్థానంలో ఉండగా, జోఫ్రా ఆర్చర్ 5 మ్యాచ్‌ల్లో 7 వికెట్లతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ 6 వికెట్లతో టాప్-5లో కొనసాగుతున్నాడు.

హైదరాబాద్ ప్లేయర్ల ఆధిపత్యం

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్ పట్టికలో మొదటి ఇద్దరు ఆటగాళ్లు హైదరాబాద్ వారే కావడం గమనార్హం. క్లాసెన్ సగటు 44.80 కాగా, స్ట్రైక్ రేట్ కూడా అదిరిపోయేలా ఉంది. మరోవైపు ఇషాన్ కిషన్ 190.18 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లను భయపెడుతున్నాడు. రాజస్థాన్ ఓపెనర్లు ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉండేవారు, కానీ హైదరాబాద్ బౌలర్లు వారిని కట్టడి చేయడంతో పట్టికలో కిందకు పడిపోవాల్సి వచ్చింది. రాబోయే మ్యాచ్‌ల్లో ఈ రేసు మరింత ఉత్కంఠగా మారనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసులో సన్‌రైజర్స్ హవా
ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసులో సన్‌రైజర్స్ హవా
ఎల్‌ఐసీ ఇన్వెస్టర్లు జాక్ పాట్ ఛాన్స్.. ఒకటి కొంటే ఒకటి ఉచితం
ఎల్‌ఐసీ ఇన్వెస్టర్లు జాక్ పాట్ ఛాన్స్.. ఒకటి కొంటే ఒకటి ఉచితం
వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ పేరిట కోట్లాది రూపాయలకు కుచ్చుటోపీ
మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ పేరిట కోట్లాది రూపాయలకు కుచ్చుటోపీ
ఎన్టీఆర్‏తో సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందో ఇప్పటికీ అర్థం కాదు..
ఎన్టీఆర్‏తో సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందో ఇప్పటికీ అర్థం కాదు..
ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్.. పెన్షన్ల విధానంలో మార్పులు
ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్.. పెన్షన్ల విధానంలో మార్పులు
బ్యూటీ పార్లర్ అక్కర్లేదు.. కేవలం 2 రూపాయల ఖర్చుతో బోలెడు అందం!
బ్యూటీ పార్లర్ అక్కర్లేదు.. కేవలం 2 రూపాయల ఖర్చుతో బోలెడు అందం!
ఇమ్యూనిటీని చిటికెలో పెంచే.. క్యారెట్ మజ్జిగ పులుసు
ఇమ్యూనిటీని చిటికెలో పెంచే.. క్యారెట్ మజ్జిగ పులుసు
నార్మల్ ఏసీ vs ఇన్వర్టర్ ఏసీ: మీ ఇంటికి ఏది బెస్ట్..?
నార్మల్ ఏసీ vs ఇన్వర్టర్ ఏసీ: మీ ఇంటికి ఏది బెస్ట్..?
ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేశారు.. బన్నీకి బ్లాక్‌బస్టర్..
ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేశారు.. బన్నీకి బ్లాక్‌బస్టర్..