IPL 2025: స్కాంలో చిక్కుకున్న షమీ కుటుంబ సభ్యులు.. దర్యాప్తు తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే?
MNREGA Fraud Case: భారత క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ మొహమ్మద్ షమీ తన కుటుంబ విషయాల కారణంగా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం షమీ ఐపీఎల్ (IPL) 2025లో బిజీగా ఉన్నాడు. ఐపీఎల్ 2025లో అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరపున ఆడుతున్నాడు.

MNREGA Fraud Case: భారత క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ మొహమ్మద్ షమీ తన కుటుంబ విషయాల కారణంగా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం షమీ ఐపీఎల్ (IPL) 2025లో బిజీగా ఉన్నాడు. ఐపీఎల్ 2025లో అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో షమీని రూ.10 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం, అతని సోదరి, బావ ప్రభుత్వ పథకం MNREGA పనుల్లో మోసం చేశారనే వార్తలు వచ్చాయి. షమీ సోదరి, బావ కాకుండా మరికొందరు బంధువులు సహా మొత్తం 18 మంది ఈ మోసంలో పాలుపంచుకున్నట్లు తెలింది. దర్యాప్తులో, వారందరూ MNREGA కింద అక్రమంగా డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు . ఈ విషయంలో తాజా అప్‌డేట్ వచ్చింది.
మహ్మద్ షమీ సోదరి, బావకి క్లీన్ చిట్ ..
అమ్రోహా జిల్లాలో జరిగిన MNREGA పనుట్లు అవతకవలపై సీనియర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత, క్రికెటర్ మహ్మద్ షమీ సోదరి, బావకి క్లీన్ చిట్ లభించింది. క్లీన్ చిట్ లభించిన తర్వాత కూడా వీరికి లక్షల నష్టం జరగబోతోంది. కారణం డీఎం చర్యలనే తెలుస్తోంది. మొహమ్మద్ షమీ సోదరి షబీనా అత్తగారు, ప్రస్తుత గ్రామ అధిపతి గులే ఆయేషాను హెడ్ పదవి నుంచి తొలగించాలని సూచనలు చేశారు. ఈ కేసులో గ్రామపెద్ద ఖాతాలన్నింటినీ సీజ్ చేయడమే కాకుండా, వారి నుంచి రూ.8 లక్షల 68 వేల 344 కూడా రికవరీ చేసేందుకు ఆదేశించారంట.
స్కామ్‌లో ఎనిమిది మంది షమీ కుటుంబ సభ్యులు..
కొన్ని రోజుల క్రితం, షమీ సోదరి షబీనా, ఆమె భర్త ఘజ్నవి ఇందులో అవకతవకలకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. వారు గత రెండు-మూడు సంవత్సరాలుగా ప్రతి నెలా MNREGA పథకాన్ని తమకు అనుగుణంగా మార్చుకుని అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపించాయి. MNREGAలో కార్మికులకు వారి పనికి ప్రతిఫలంగా ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు వందల రూపాయలు ఇస్తారనే సంగతి తెలిసిందే. షమీ సోదరి, ఆమె భర్త ప్రతి నెలా ఏ పని చేయకుండానే కూలీల నుంచి ఈ డబ్బును తీసుకునేవారు. దర్యాప్తు ముందుకు సాగుతుండగా షమీ కుటుంబంలోని మరో ఎనిమిది మందితో సహా మొత్తం 18 మంది ప్రమేయం ఉన్నట్లు తేలింది. వారందరూ ఏ పని చేయకుండానే MNREGA లో లక్షల రూపాయలు వేతనంగా తీసుకున్నట్లు తేలింది.
ఈ సంఘటన తర్వాత మహ్మద్ షమీ ట్రోల్‌కు గురయ్యాడు. ఈ అవకాశాన్ని అతని మాజీ భార్య ఉపయోగించుకుని, తీవ్రమైన ఆరోపణలు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








