IPL 2025 Schedule: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆ 2 జట్ల మధ్యే తొలి మ్యాచ్.. ఐపీఎల్ కొత్త సీజన్‌లో బీసీసీఐ కీలక మార్పులు?
IPL 2025 Schedule: ఐపీఎల్ 2025 షెడ్యూల్‌కు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. నివేదిక ప్రకారం, ఈ టోర్నమెంట్ మార్చి 22న ప్రారంభం కావచ్చు. ఇది కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. పూర్తి షెడ్యూల్‌ను బోర్డు ఒకటి లేదా రెండు రోజుల్లో విడుదల చేయవచ్చు అని తెలుస్తోంది.

IPL 2025 Schedule: ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్ వేదిక గురించి బీసీసీఐ ఇప్పటికే సమాచారం ఇచ్చింది. కానీ, తేదీ, జట్ల గురించి ఏం చెప్పలేదు. కానీ, తాజాగా ఓ విషయం బయటకు వచ్చింది. నివేదిక ప్రకారం, ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ మార్చి 22, శనివారం నాడు జరుగుతుంది. ఇది డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభమవుతుంది. లీగ్ ఓపెనర్ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ సొంత మైదానంలో, అంటే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది.
SRH vs RR మధ్య 2వ మ్యాచ్..
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, KKR వర్సెస్ RCB మధ్య పోరు జరిగిన మరుసటి రోజే, గత సీజన్ ఫైనలిస్ట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ 18వ సీజన్‌లో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 23 ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ SRH హోమ్ గ్రౌండ్, ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు జరుగుతుంది. ఈ రోజు రెండు మ్యాచ్‌లు ఉండవచ్చు. టోర్నమెంట్ మ్యాచ్‌ల తేదీలను బీసీసీఐ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌ల తేదీల గురించి ఆయా జట్లకు అనధికారికంగా తెలియజేసింది.
బీసీసీఐ మార్పులు, షెడ్యూల్ ఎప్పుడంటే?
జనవరి 12న ముంబైలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో, మార్చి 23న ఐపీఎల్ ప్రారంభం కావచ్చని బీసీసీఐ ఉపాధ్యక్షుడు సూచనప్రాయంగా తెలిపారు. కానీ, క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఇప్పుడు బోర్డు దానిలో కొన్ని మార్పులు చేసింది. ఈ నివేదికను నమ్ముకుంటే, టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్ రాబోయే 1 నుంచి 2 రోజుల్లో విడుదల కావొచ్చు. ఐపీఎల్ కొత్త సీజన్‌లో ఫైనల్‌తో సహా మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయని తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మొదటి మ్యాచ్‌తో పాటు, IPL 2025 ఫైనల్ కూడా మే 25న జరుగుతుంది. సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రెండు ప్లే-ఆఫ్ మ్యాచ్‌లు జరుగుతాయి.
12 వేదికలలో మ్యాచ్‌లు..
బీసీసీఐ వేదికలో కూడా కొన్ని మార్పులు చేసింది. ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లు 10 చోట్ల కాకుండా 12 చోట్ల జరుగుతాయి. కొత్త సీజన్‌లో 2 వేదికలు జోడించారు. వాటిలో గౌహతి, ధర్మశాల ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఈ టోర్నమెంట్‌లో తమ రెండవ వేదికగా ధర్మశాలను ఎంచుకుంది. ఇక్కడ 3 మ్యాచ్‌లు ఆడవచ్చు. రాజస్థాన్ రాయల్స్ జైపూర్‌తో పాటు గౌహతిని తమ రెండవ వేదికగా చేసుకుంది. మార్చి 26, 30 తేదీలలో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడతారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








