Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ జట్టుకు బిగ్ షాక్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ
Pakistan ODI Tri-Series, 2025: ముక్కోణపు సిరీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించడం ద్వారా పాకిస్తాన్ జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించింది. కానీ, ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు ముగ్గురు ఆటగాళ్ళు తమ పరిమితులను దాటారు. షాహీన్ అఫ్రిది, సౌద్ షకీల్, కమ్రాన్ గులాం లపై ఐసీసీ భారీ జరిమానాలు విధించింది.

New Zealand vs Pakistan, Final: పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదికి ఐసీసీ భారీ జరిమానా విధించింది. కరాచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ముగ్గురు పాకిస్తాన్ ఆటగాళ్లు దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఐసీసీ రంగంలోకి దిగి, చర్యలు తీసుకుంది. షహీన్ అఫ్రిదితో పాటు, సౌద్ షకీల్, కమ్రాన్ గులాంలకు కూడా ఐసీసీ జరిమానా విధించింది. దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్‌మన్ మాథ్యూ బ్రీట్జ్‌కేతో షాహీన్ అఫ్రిది గొడవకు దిగాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా ఔట్ అయిన తర్వాత కమ్రాన్ గులాం, సౌద్ షకీల్ దూకుడుగా సంబరాలు చేసుకున్నారు.
షాహీన్ అఫ్రిది దూకుడు..
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 28వ ఓవర్‌లో అఫ్రిది, మాథ్యూ బ్రీట్జ్‌కే మధ్య గొడవ జరిగింది. షాహీన్ వేసిన ఐదవ బంతికి, మాథ్యూ బ్రీట్జ్కే మిడ్-ఆన్ ప్రాంతంలో షాట్ కొట్టాడు. ఆ తర్వాత అఫ్రిది అతనితో ఏదో అన్నాడు. మాథ్యూ ఒకటి లేదా రెండుసార్లు పిచ్ వైపు పరిగెత్తడం షాహీన్ కు బాధ కలిగించింది. దీనిపై అఫ్రిది తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏదో చెప్పి అతని వైపు చూశాడు. దానికి మాథ్యూ బదులిచ్చాడు. ఆ తర్వాతి బంతికి మాథ్యూ ఒక పరుగు తీసుకుని పరిగెడుతున్నప్పుడు, ఆఫ్రిది అతని అడ్డుగా వచ్చాడు. ఈ విషయం ముదిరింది. అంపైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పరిస్థితిని శాంతింపజేయడానికి దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా, మహ్మద్ రిజ్వాన్ రంగంలోకి దిగారు.
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా రనౌట్ అయిన తర్వాత కమ్రాన్ గులాం, సౌద్ షకీల్ కూడా దూకుడుగా సంబరాలు చేసుకున్నారు. కమ్రాన్ గులాం వెళ్లి అరుస్తూ, రెచ్చగొట్టాడు. ఆ తర్వాత అతను మ్యాచ్ ఆడకపోయినా అతనిపై చర్యలు తీసుకున్నారు.
భారీ టార్గెట్ ఛేదించిన పాక్..
అయితే, బుధవారం పాకిస్తాన్ అద్భుతంగా ఆడి దక్షిణాఫ్రికాను 6 వికెట్ల తేడాతో ఓడించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 353 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 6 బంతుల ముందుగానే సాధించింది. పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘా సెంచరీలు సాధించి పాకిస్థాన్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించారు.








