IPL 2024: సహనం కోల్పోయిన కింగ్ కోహ్లీ.. యశ్‌ దయాల్‌పై తీవ్ర ఆగ్రహం.. బాటిల్ విసిరి.. వీడియో వైరల్

|

May 23, 2024 | 9:04 PM

ఐపీఎల్ ట్రోఫీ గెలవడం ఆర్సీబీకి కలగానే మిగిలిపోయింది. లీగ్‌లో RCB అద్భుతమైన పునరాగమనం చేసినప్పుడు, ఈ జట్టు కప్ గెలుస్తుందని అందరూ భావించారు. ఇన్నేళ్లుగా సాధ్యం కానిది ఈ ఐపీఎల్ సీజన్‌లో సాధ్యమయ్యే అవకాశం ఉందని కలలు కన్నారు. కానీ RCB ఆటగాళ్లు, లక్షలాది RCB అభిమానుల కలలు కలగానే మిగిలిపోయాయి.

IPL 2024: సహనం కోల్పోయిన కింగ్ కోహ్లీ.. యశ్‌ దయాల్‌పై తీవ్ర ఆగ్రహం.. బాటిల్ విసిరి.. వీడియో వైరల్
Virat Kohli
Follow us on

ఐపీఎల్ ట్రోఫీ గెలవడం ఆర్సీబీకి కలగానే మిగిలిపోయింది. లీగ్‌లో RCB అద్భుతమైన పునరాగమనం చేసినప్పుడు, ఈ జట్టు కప్ గెలుస్తుందని అందరూ భావించారు. ఇన్నేళ్లుగా సాధ్యం కానిది ఈ ఐపీఎల్ సీజన్‌లో సాధ్యమయ్యే అవకాశం ఉందని కలలు కన్నారు. కానీ RCB ఆటగాళ్లు, లక్షలాది RCB అభిమానుల కలలు కలగానే మిగిలిపోయాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ పరాజయాన్ని చవిచూసింది. అయితే మ్యాచ్ రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. పేలవమైన బౌలింగ్ తో వరుసగా బౌండరీలు సమర్పించుకున్న యశ్ దయాల్ పై కింగ్ కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిజానికి రాజస్థాన్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసే బాధ్యతను యశ్ దయాల్ కు అప్పగించారు. తొలి రెండు బంతుల్లో 2 పరుగులు మాత్రమే ఇచ్చిన యశ్ దయాల్ విజయంపై ఆశలు రేకెత్తించాడు. కానీ దీని తర్వాత అతను వేసిన రెండు చెత్త బంతులను షిమ్రాన్ హెట్మెయర్ బౌండరీకి తరలించాడు. ఈ రెండు బ్యాడ్ డెలివరీల నుంచి 8 పరుగులు వచ్చాయి.

ఇలా మ్యాచ్ కీలక దశలో పేలవంగా బౌలింగ్ చేసిన యశ్ దయాల్ పై కోహ్లీకి పట్టరాని కోపం వచ్చింది. అతనిని తిడుతూ కనిపించాడు. ఇక్కడితో ఆగని కోహ్లీ ఎనర్జీ డ్రింక్ తాగి బాటిల్‌ని బౌండరీ లైన్‌పైకి విసిరాడు. ఆ తర్వాత కూడా ఏదో గొణుగుతూ కనిపించాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

ఆర్సీబీ బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణం

గత 6 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో అద్భుతంగా ఆడిన ఆర్సీబీ.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో తడబడింది. కెప్టెన్ డుప్లెసిస్ 17 పరుగులకు ఔట్ కాగా, కోహ్లీ 24 బంతుల్లో 33 పరుగులు, గ్రీన్ 27 పరుగులు, పాటిదార్ 34 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. కానీ మంచి ఆరంభాన్ని భారీ ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయాడు. అలాగే మాక్స్‌వెల్ ఖాతా కూడా తెరవలేదు. దీంతో RCB జట్టు 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ టార్గెట్ ను రాజస్థాన్ మరో 6 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి అందుకుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..