Nita Ambani: ముంబై ఇండియన్స్ టీమ్‌కు నీతా అంబానీ కీలక సందేశం..
ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టు 2024 ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైంది. లీగ్ దశ నుంచే ఇంటిముఖం పట్టింది. ఆడిన 14 మ్యాచుల్లో కేవలం నాలుగింటిలోనే విజయం సాధించి, పాయింట్ల పట్టికలలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్సీ మార్పు ఆ జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందనేది క్రీడా విశ్లేషకుల మాట. కొత్త సారధి హార్దిక్ పాండ్యా జట్టును నడిపించడంలో విఫలమవడమే కాకుండా..
ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టు 2024 ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైంది. లీగ్ దశ నుంచే ఇంటిముఖం పట్టింది. ఆడిన 14 మ్యాచుల్లో కేవలం నాలుగింటిలోనే విజయం సాధించి, పాయింట్ల పట్టికలలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్సీ మార్పు ఆ జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందనేది క్రీడా విశ్లేషకుల మాట. కొత్త సారధి హార్దిక్ పాండ్యా జట్టును నడిపించడంలో విఫలమవడమే కాకుండా… వ్యక్తిగతంగానూ పాండ్యా రాణించలేకపోయాడనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. గుజరాత్ టైటాన్స్ ను రెండుసార్లు ఫైనల్‌కి తీసుకెళ్లిన అతడు.. ముంబైకి వచ్చేసరికి కెప్టెన్‌గా పూర్తిగా తేలిపోయాడు. దీంతో ముంబైకి ఈ సీజన్‌లో ఘోర పరాభవం తప్పలేదు. ఈ క్రమంలో తమ టీమ్‌కు నీతా అంబానీ కీలక సందేశం ఇచ్చారు. వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం ముంబై జట్టు నుంచి నలుగురు ప్లేయర్లు ఎంపికయ్యారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా పొట్టి ప్రపంచకప్‌కు సెలక్ట్ అయ్యారు. హిట్‌మ్యాన్ సారథ్యంలోనే టీమిండియా వరల్డ్‌కప్ ఆడనుంది. ఈ క్రమంలో తమ జట్టు సభ్యులను ఉద్దేశించి MI ఓనర్ నీతా అంబానీ కీలక సందేశం ఇచ్చారు. ఈ ఐపీఎల్ సీజన్ మనకు చాలా నిరుత్సాహకరంగా ముగిసింది. మనం అనుకున్న విధంగా అన్నీ జరగవు. ఇప్పటికీ నేను ముంబై ఇండియన్స్‌కు అతిపెద్ద అభిమానిని. ఈ జట్టు జెర్సీని ధరించడాన్ని గౌరవంగా భావిస్తాను. ఈ సీజన్‌లో మనం ఎక్కడ వెనుకబడ్డామో తర్వాత సమీక్షించుకుందాం. తప్పకుండా భవిష్యత్తులో బలంగా ముందకొస్తాం. జాతీయ జట్టు తరఫున టీ20 వరల్డ్‌కప్ ఆడేందుకు సిద్ధమవుతున్న ప్లేయర్స్‌కి ఆల్ ది బెస్ట్. రోహిత్, హార్దిక్, సూర్య, బుమ్రా.. మీ అద్భుత ప్రదర్శనతో భారతీయులను ఆనందపరుస్తారని ఆశిస్తున్నాను. టీమిండియా టోర్నీ విజేతగా నిలిచి వరల్డ్‌కప్ టైటిల్‌తో రావాలని కోరుకుంటున్నాను అంటై నీతా ముంబై ఇండియన్స్ ఎక్స్ ఖాతా ద్వారా సందేశమిచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.