Lucknow Super Giants vs Kolkata Knight Riders: కోల్ కతా బ్యాటర్లు మళ్లీ చెలరేగారు. లక్నో బౌలర్లను చిత్తు చేస్తూ భారీ స్కోరు సాధించారు. మరీ ముఖ్యంగా సునీల్ నరైన్ (39 బంతుల్లో 81, 6 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆఖరిలో శ్రేయస్ అయ్యర్ (23), రమణ్ దీప్ సింగ్ ధాటిగా ఆడడంతో ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతకు ముందు ఫిలిప్ సాల్ట్ (32), రఘువంశీ (32) దూకుడుగా ఆడారు. అయితే ఆండ్రీ రస్సెల్ (12), రింకూ సింగ్ (16) పెద్దగా పరుగులు చేయలేకపోయారు. లక్నో బౌలర్లలో నవీనుల్ 3 వికెట్లు పడగొట్టగా, బిష్ణోయ్, యుధ్వీర్, ఠాకూర్ తలో వికెట్ తీశారు. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ఇరు జట్లకు చాలా కీలకం. మరి కేకేఆర్ విధించిన భారీ లక్ష్యాన్ని లక్నో ఛేదిస్తుందో లేదో చూడాలి.
SAILING AWAY ⛵️
Sunil Narine’s fabulous run continues with another stroke full FIFTY 💥
He also crosses the 4️⃣0️⃣0️⃣- run mark for the first time in #TATAIPL 👏👏
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#LSGvKKR | @KKRiders pic.twitter.com/Iw1aeFz9nQ
— IndianPremierLeague (@IPL) May 5, 2024
ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.
అంకుల్ రాయ్, మనీష్ పాండే, శ్రీకర్ భరత్, షెర్ఫనే రూథర్‌ఫోర్డ్, వైభవ్ అరోరా
KL రాహుల్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్
అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, దేవదత్ పడిక్కల్
𝗞𝗔𝗕𝗢𝗢𝗠 💥
Ramandeep Singh adding merry to #KKR‘s total 👌
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #LSGvKKR | @KKRiders pic.twitter.com/U3nxM2vuOx
— IndianPremierLeague (@IPL) May 5, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..