SRH vs RR: తొలిసారి ప్రపంచకప్‌లో చోటు పట్టేశాడు.. కట్‌చేస్తే.. చెత్త రికార్డ్‌తో రోహిత్‌కి టెన్షన్ పెంచేసిన చాహల్..

Yuzvendra Chahal most sixes in IPL: ఐపీఎల్ 2024 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తలపడిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో హైదరాబాద్ 36 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. SRH 6 సంవత్సరాల తర్వాత ఈ లీగ్‌లో ఫైనల్‌కు చేరుకుంది. అంతకుముందు 2018లో ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. మే 26న ఈ సీజన్ ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో హైదరాబాద్ తలపడనుంది.

SRH vs RR: తొలిసారి ప్రపంచకప్‌లో చోటు పట్టేశాడు.. కట్‌చేస్తే.. చెత్త రికార్డ్‌తో రోహిత్‌కి టెన్షన్ పెంచేసిన చాహల్..
Yuzvendra Chahal
Follow us

|

Updated on: May 25, 2024 | 8:43 AM

Yuzvendra Chahal Unwanted Record: ఐపీఎల్ 2024 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తలపడిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో హైదరాబాద్ 36 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. SRH 6 సంవత్సరాల తర్వాత ఈ లీగ్‌లో ఫైనల్‌కు చేరుకుంది. అంతకుముందు 2018లో ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. మే 26న ఈ సీజన్ ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో హైదరాబాద్ తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అనుభవజ్ఞుడైన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరిట అవాంఛిత రికార్డు నమోదైంది. నిజానికి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్‌గా చాహల్ నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో చాహల్ తన 4 ఓవర్లలో వికెట్ పడకుండా 34 పరుగులు ఇచ్చాడు. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 160 మ్యాచ్‌లు ఆడాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్ల లిస్టులో చాహల్ మొదటి స్థానంలోకి దూసుకొచ్చాడు. చాహల్ ఇప్పటివరకు 224 సిక్సర్లు కొట్టాడు.

భారత జట్టులోకి ఎంపికైనప్పటి నుంచి పేలవ ప్రదర్శన..

T20 ప్రపంచ కప్ 2024 ఈవెంట్‌కు ముందు చాహల్ ప్రదర్శనను చూసిన భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాబోయే టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టులో చాహల్ ఎంపికైన సంగతి తెలిసిందే. జట్టును ప్రకటించినప్పటి నుంచి చాహల్ ప్రదర్శన నిరాశపరిచింది. జట్టు ప్రకటించిన తర్వాత ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు మాత్రమే తీశాడు. అదే సమయంలో, అతనిపై బ్యాట్స్‌మెన్స్ భారీగా పరుగులు సాధించడం విశేషం.

చాహల్‌తో పాటు ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బౌలర్ల జాబితా ఇదే..

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్ల జాబితాలో పీయూష్ చావ్లా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో పీయూష్ ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. చావ్లా తన ఐపీఎల్ కెరీర్‌లో తన బౌలింగ్‌లో 222 సిక్సర్లు ఇచ్చాడు.

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఈ జాబితాలో చేరి మూడో స్థానంలో ఉన్నాడు. జడేజా తన 240 మ్యాచ్‌ల ఐపీఎల్ కెరీర్‌లో 206 సిక్సర్లు ఇచ్చాడు. ఈ అవాంఛిత జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అశ్విన్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 202 సిక్సర్లు ఇచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.