
ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఆదివారం (మార్చి 24) తన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఇదే మ్యాచ్‌లో ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రికార్డులపై కన్నేశాడు. క్రీజులో నిలబడితే సిక్సర్ల వర్షం కురిపించే రోహిత్ శర్మ టీ20 క్రికెట్ లో ఇప్పటి వరకు 487 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ ఈ సీజన్‌లో మరో 13 సిక్సర్లు కొట్టగలిగితే, టీ20 ఫార్మాట్‌లో 500 సిక్సర్లు బాదిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. టీ20 క్రికెట్‌లో ఇప్పటి వరకు కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే 500కు పైగా సిక్సర్లు కొట్టగలిగారు. వారిలో 1065 సిక్సర్లు బాది విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. రెండు, మూడు స్థానాల్లో కూడా వెస్టిండీస్ ఆటగాళ్లు ఉండడం గమనార్హంజ. 860 సిక్సర్లతో కీరన్ పొలార్డ్ రెండో థానంలో ఉండగా, వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ మూడో స్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 243 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను ముంబై ఇండియన్స్ తరఫున 198 మ్యాచ్‌లు ఆడాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరో 2 మ్యాచ్‌లు ఆడడం ద్వారా ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్‌కు రోహిత్ తొలి ఆటగాడు అవుతాడు.
రోహిత్ శర్మ తన IPL కెరీర్‌లో మొదటి 3 సీజన్‌లను డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడాడు. ఈ జట్టు తరఫున రోహిత్ మొత్తం 45 మ్యాచ్‌లు ఆడాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో ఇప్పటి వరకు మొత్తం 109 క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా సురేష్ రైనా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ ఇప్పటివరకు 98 క్యాచ్‌లు పట్టాడు. ఇప్పుడు రోహిత్‌కు క్యాచ్‌ల సెంచరీ పూర్తి కావాలంటే కేవలం 2 క్యాచ్‌లు మాత్రమే కావాలి. ఇది సాధ్యమైతే రోహిత్ ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడు అవుతాడు. ఇదిలా ఉంటే గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి
“Preparation is 🔑”
📹 Hear from Ro ahead of #GTvMI 💪#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 pic.twitter.com/aumxOpBdhQ
— Mumbai Indians (@mipaltan) March 24, 2024
𝐋𝐢𝐠𝐡𝐭𝐬. 𝐂𝐚𝐦𝐞𝐫𝐚. #GTvMI. 🎬
🎙️ @hardikpandya7 shares his thoughts before our season opener 💬#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/CXOxLcdxOJ
— Mumbai Indians (@mipaltan) March 24, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..