Kohli – Perry: 17 ఏళ్ల క్రితమే పెర్రీకి లైన్ వేసిన కోహ్లీ.. ఇదిగో వీడియో ప్రూఫ్

మైదానంలో కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ క్రికెట్‌ టీమ్‌కు కెప్టెన్‌గా కూడా సేవలు అందించిన కోహ్లీ.. ప్రస్తుతం జట్టులో కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అలానే ఐపీఎల్‌లో రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Kohli - Perry: 17 ఏళ్ల క్రితమే పెర్రీకి లైన్ వేసిన కోహ్లీ.. ఇదిగో వీడియో ప్రూఫ్
Alyssa Healy, Ellyse Perry - Virat Kohli
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 24, 2024 | 4:57 PM

విరాట్ కోహ్లీ.. వన్డే క్రికెట్‌‌లో ఆల్ టైమ్ గ్రేట్‌ ప్లేయర్. వన్డేల్లో 50 సెంచరీలు చేసిన క్రికెటర్‌ కోహ్లీ మాత్రమే. అభిమానులు అతడిని ముద్దుగా రన్ మెషీన్ పిలుచుకుంటారు. మైదానంలో కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ క్రికెట్‌ టీమ్‌కు కెప్టెన్‌గా కూడా సేవలు అందించిన కోహ్లీ.. ప్రస్తుతం జట్టులో కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అలానే ఐపీఎల్‌లో రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే విరాట్ కోహ్లీ గురించి ఆస్ట్రేలియా లేడీ క్రికెటర్ అలిస్సా హీలీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. దాదాపు 17 ఏళ్ల క్రితం… తాను, ఎల్లిస్ పెర్రీ కలిసి క్రికెట్ గ్రౌండ్‌లో ఉండగా.. విరాట్ కోహ్లీ వారి వద్దకు వెళ్లాడట. వెళ్లి.. తనని తాను పరిచయం చేసుకుండా. హాయ్.. హలో అని అన్నాడట. ఆపై తదుపరి భారత క్రికెట్‌లో తాను పెద్ద ప్లేయర్ అని చెప్పాడట. ఆ మాట వినగానే.. అలిస్సా హీలీ, ఎల్లిస్ పెర్రీ కాసేపు నవ్వుకున్నారట. ఆ మాట చెప్పిన పర్సన్ మరెవరో కాదు.. G.O.A.T విరాట్ కోహ్లీ. అయితే ఈ విషయం కోహ్లీకి గుర్తుండకపోవచ్చని..అలిస్సా హీలీ పేర్కొన్నారు. దీంతో నెటిజన్స్ స్టన్ అవుతున్నారు.

కోహ్లీ అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్ ఆడిన సమయంలో ఇది జరిగి ఉండొచ్చని డీకోడ్ చేస్తున్నారు. అప్పుడే పెర్రీకి లైన్ వేసేందుకు ట్రై చేశావా అన్న మరొకరు కామెంట్ పెట్టారు. ‘కోహ్లీ తప్పు చెప్పాడు.. భారత క్రికెట్ కాదు.. ప్రపంచ క్రికెట్‌లోనే అతను పెద్ద ప్లేయర్’ అని మరొకరు కామెంట్ పెట్టారు.

‘The first time I met Virat Kohli’ -Alyssa Healy and Ellyse Perry byu/KarlPeriyar inIndiaCricket

విరాట్‌కు ‘చీకూ’ అనే పేరెలా వచ్చింది?

ఒకసారి భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ జరుగుతుండగా  ధోనీ, గ్రౌండ్‌లోనే  కోహ్లీని చీకూ అంటూ పిలిచాడు. ఆ తర్వాత నుంచి చీకూ అనే పేరు బాగా పాపులర్ అయింది. అప్పటివరకు క్రికెట్ ప్రపంచంలో ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’గా ముద్ర పడిన కోహ్లీకి అప్పటినుంచి చీకూ అనే ముద్దుపేరు ఫిక్సయిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..