IPL 2024: అంబరాన్నంటిన ఆర్సీబీ సంబరాలు.. డ్రెస్సింగ్ రూమ్‌లో డ్యాన్స్‌లే డ్యాన్స్‌లు.. వీడియో చూశారా?

|

May 13, 2024 | 6:19 PM

ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది. బెంగళూరు సొంత గడ్డ చిన్న స్వామి స్టేడియం వేదికగా ఆదివారం (మే12) జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో విజయంతో ఆర్సీబీ తమ ప్లేఆఫ్ కలను సజీవంగా ఉంచుకుంది. లీగ్‌లో RCB కి ఇది వరుసగా 5వ విజయం.

IPL 2024: అంబరాన్నంటిన ఆర్సీబీ సంబరాలు.. డ్రెస్సింగ్ రూమ్‌లో డ్యాన్స్‌లే డ్యాన్స్‌లు.. వీడియో చూశారా?
Royal Challengers Bengaluru
Follow us on

ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది. బెంగళూరు సొంత గడ్డ చిన్న స్వామి స్టేడియం వేదికగా ఆదివారం (మే12) జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో విజయంతో ఆర్సీబీ తమ ప్లేఆఫ్ కలను సజీవంగా ఉంచుకుంది. లీగ్‌లో RCB కి ఇది వరుసగా 5వ విజయం. ఇప్పటివరకు మొత్తం 6 విజయాలతో 12 పాయింట్లు ఆర్సీబీ ఖాతాలో ఉన్నాయి. నిజానికి లీగ్‌లో ఆర్‌సీబీకి శుభారంభం లభించలేదు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఫాఫ్ జట్టు వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్‌ అవకాశాలు ఆదిలోనే సన్నగిల్లాయి. అయితే ఆ తర్వాత గోడకు కొట్టిన బంతిలా తన ఆటతీరును ఆర్‌సీబీ తన ఆట తీరును మార్చుకుంది. తిరిగి విన్నింగ్ ట్రాక్‌లోకి రాగలిగింది. ఢిల్లీపై ఆర్‌సీబీకి విజయం అత్యవసరం. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోయి ఉంటే ప్లేఆఫ్‌కు దాదాపు తలుపులు మూసుకుపోయేవి. ఈ విషయం ఆర్సీబీ ఆటగాళ్లకు బాగా తెలుసు. అందుకే విజయం తర్వాత జట్టు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు చేసుకున్నారు. ఆర్‌సీబీ కోచింగ్ సిబ్బంది జట్టులోని ప్రతి ఒక్కరినీ ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. అందులో, కామెరూన్ గ్రీన్, రజత్ పాటిదార్‌తో సహా ఆటగాళ్లందరూ సెలబ్రేషన్స్ లో మునిగితేలడం చూడవచ్చు.

 

ఇవి కూడా చదవండి

నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్‌కు చేరువలో ఉంది. అయితే ఇందుకు ఇతర జట్ల ఫలితాలు ఆర్సీబీకి అనుకూలంగా రావాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. జట్టు తరఫున రజత్ పాటిదార్ 32 బంతుల్లో 52 పరుగులు, విల్ జాక్స్ 29 బంతుల్లో 41 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ 27 పరుగులు చేశాడు. అనంతరం ఢిల్లీ జట్టు 19.1 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. రిషబ్ పంత్ స్థానంలో కెప్టెన్‌గా బరిలోకి దిగిన అక్షర్ పటేల్ 39 బంతుల్లో 57 పరుగులు చేసి విజయం కోసం చివరి వరకు పోరాడాడు.

ప్లేఆఫ్ రేసులో RCB

ఢిల్లీపై విజయంతో ఆర్‌సీబీ 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఏడు ఓటములతో 12 పాయింట్లు సాధించింది. ఇప్పుడు RCB మే 18న చిన్నస్వామిలో చెన్నై సూపర్ కింగ్స్‌తో తన చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌పైనే ఇరు జట్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. చెన్నై గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అదే సమయంలో బెంగళూరు గెలిస్తే మంచి తేడాతో గెలవాలి, తద్వారా చెన్నై కంటే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంటుంది. దీని తర్వాత కూడా ఇతర జట్ల ఫలితాలను బట్టే బెంగళూరు ఆర్సీబీ అవకాశాలుంటాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..