AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: పింక్ జెర్సీలతో బరిలోకి రాజస్థాన్.. అసలు కారణం తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే..

IPL 2024 2024: రాజస్థాన్ జట్టు పూర్తిగా గులాబీ రంగు జెర్సీ ధరించి RCBతో మ్యాచ్ ఆడనుంది. దీనికి సంబంధించి రాజస్థాన్ ఫ్రాంచైజీ శుక్రవారం ఓ వీడియోను విడుదల చేసి, ఈ వీడియోలో కొత్త జెర్సీని విడుదల చేసింది. అయితే, ఇందుకు ప్రత్యేక కారణం కూడా ఉంది.

IPL 2024: పింక్ జెర్సీలతో బరిలోకి రాజస్థాన్.. అసలు కారణం తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే..
Rr Vs Rcb Pink Jersey
Venkata Chari
|

Updated on: Apr 06, 2024 | 12:22 PM

Share

RR vs RCB: ఐపీఎల్ (IPL 2024) 17వ ఎడిషన్‌లోని 19వ మ్యాచ్‌లో శనివారం అంటే రేపు, ఆర్‌సీబీ జట్టు తమ సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ (RR vs RCB)తో తలపడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ స్థానిక జట్టు రాజస్థాన్ (Rajasthan Royals)కి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు భారీ మార్పులతో రంగంలోకి దిగనుంది. ఈ సమాచారాన్ని ఫ్రాంచైజీ తన అధికారిక X ఖాతాలో షేర్ చేసింది. దీని ప్రకారం ఆర్సీబీతో జరిగే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు మొత్తం ప్రత్యేక జెర్సీని ధరించనుంది.

పూర్తి గులాబీ రంగు జెర్సీ..

పైన చెప్పినట్లుగా, రాజస్థాన్ జట్టు పూర్తిగా గులాబీ రంగు జెర్సీ ధరించి RCBతో మ్యాచ్ ఆడుతుంది. దీనికి సంబంధించి రాజస్థాన్ ఫ్రాంచైజీ శుక్రవారం ఓ వీడియోను విడుదల చేసి, ఈ వీడియోలో కొత్త జెర్సీని విడుదల చేసింది. కేవలం ఒక మ్యాచ్‌కు మాత్రమే పరిమితం చేసిన ఈ జెర్సీ మొత్తం గులాబీ రంగులో ఉంటుంది. నిజానికి, రాయల్స్ జట్టు ప్రతి మ్యాచ్‌కి పింక్ జెర్సీలను ధరిస్తుంది.

ఇవి కూడా చదవండి

అయితే, ఆ జెర్సీపై పింక్‌తో పాటు ఇతర రంగులు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఏప్రిల్ 6న జరగనున్న మ్యాచ్ కోసం ఆ జట్టు పింక్ కలర్ జెర్సీతో మ్యాచ్ ఆడనుంది. #PinkPromise మిషన్ కింద రాజస్థాన్ జట్టు ఆడనున్న ప్రత్యేక మ్యాచ్ ఇది. మహిళల సాధికారత ఈ మిషన్ లక్ష్యం. ఇందుకోసం ఫ్రాంచైజీ అనేక ప్రణాళికలు రచించింది.

ప్రచారం అంటే ఏమిటి?

ఈ #PinkPromise ప్రచారం గురించి మాట్లాడితే, ఏప్రిల్ 6న RCBతో రాజస్థాన్ మ్యాచ్ పూర్తిగా మహిళల అభ్యున్నతికి అంకితం చేసింది. ఈ మ్యాచ్‌లో విక్రయించే ప్రతి టిక్కెట్టు నుంచి రూ.100 మహిళల అభివృద్ధికి విరాళంగా ఇవ్వనున్నారు. ఇది మాత్రమే కాదు, ఈ మ్యాచ్‌లో ప్రతి సిక్స్‌కి రాజస్థాన్‌లోని ఆరు ఇళ్లకు సౌరశక్తిని అందించనున్నారు. అలాగే టిక్కెట్ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్‌కు వెళ్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ రాయల్స్ జట్టుకు చాలా ప్రత్యేకం కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..