Mumbai Indians vs Kolkata Knight Riders Confirmed Playing XI in Telugu: IPL 2024 టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ అత్యంత నిరాశపరిచింది. జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ప్లేఆఫ్‌కు చేరుకుంటుందా అనేది అనుమానమే. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు ఇప్పటికే సన్నగిల్లాయి. ఇకకోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో ఓడిపోతే తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. ఈ మ్యాచ్ లో పరాజయం పాలైతే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా కూడా ముంబై నిలుస్తుంది. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు 32 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 23 సార్లు గెలుపొందగా, కోల్‌కతా నైట్ రైడర్స్ 9 సార్లు గెలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేయడానికి ఆసక్తి చూపించ వచ్చు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి కోల్ కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
🚨 Toss Update 🚨@mipaltan win the toss & elect to bowl first against @KKRiders
Follow the Match ▶️ https://t.co/iWTqcAsT0O#TATAIPL | #MIvKKR pic.twitter.com/yYjLioIQML
— IndianPremierLeague (@IPL) May 3, 2024
ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార
రోహిత్ శర్మ, షామ్స్ ములానీ, శివాలిక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెపర్డ్.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):
ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి
అనుకుల్ రాయ్, మనీష్ పాండే, శ్రీకర్ భరత్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, చేతన్ సకారియా
Paltan ka pyaar, just like a waving flag 💙#MumbaiMeriJaan #MumbaiIndians #MIvKKR pic.twitter.com/8zyI8rUL1a
— Mumbai Indians (@mipaltan) May 3, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..