AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 Auction: ఆ ఒక్క ప్లేయరే అందరి టార్గెట్.. రూ. 20 కోట్లైనా తగ్గేదేలే.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

IPL 2024 Auction: ఐపీఎల్ 2024 కోసం వేలం డిసెంబర్ 19 మంగళవారం దుబాయ్‌లో జరగనుంది. వేలం కోసం మొత్తం 1166 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే, ఎప్పటిలాగే ఈ వేలంలోనూ అత్యధిక ధర పలికే ఆటగాడు ఎవరోనని అంతా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ పోటీలోకి ఓ ఆల్ రౌండర్ తన పేరుతో సరికొత్త రికార్డు లిఖించే అవకాశం ఉందని తెలుస్తోంది.

IPL 2024 Auction: ఆ ఒక్క ప్లేయరే అందరి టార్గెట్.. రూ. 20 కోట్లైనా తగ్గేదేలే.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..
Ipl 2024
Venkata Chari
|

Updated on: Dec 04, 2023 | 1:58 PM

Share

IPL 2024 Auction: ఐపీఎల్ ప్రతి కొత్త సీజన్‌లో, టోర్నమెంట్‌లో అత్యంత ఖరీదైన అమ్మకానికి రికార్డు సృష్టించే ఆటగాడిపై ఎన్నో ఆశలు వినిపిస్తుంటాయి. గత సీజన్ (ఐపీఎల్ 2023) కోసం నిర్వహించిన వేలంలో, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ టోర్నీ చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. అతన్ని పంజాబ్ కింగ్స్ రూ. 18.50 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగల ఇంగ్లీష్ ఆల్ రౌండర్ రికార్డును బద్దలు కొట్టగలడని అంతా భావిస్తున్నారు.

2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియాపై సెంచరీ చేసి కోట్లాది మంది భారతీయుల హృదయాలకు బాధ కలిగించిన ట్రావిస్ హెడ్ (Travis Head).. అద్భుత ఫాంలో ఉన్నాడు. వరల్డ్ కప్‌లోని కీలక మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా తరపున హెడ్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఫైనల్‌లో భారత్‌పై 137 పరుగుల ఇన్నింగ్స్‌కు ముందు, దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ-ఫైనల్‌లో హెడ్ 62 పరుగులు చేశాడు. ఆ తర్వాత భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా హెడ్ తన తుఫాన్ శైలిని ప్రదర్శించాడు.

హెడ్ అద్భుతమైన ఫామ్ చూస్తుంటే టీంలు అతడిపై రూ.20 కోట్ల వరకు వెచ్చించవచ్చని తెలుస్తోంది. వేలంలో గుజరాత్ టైటాన్స్ అత్యధికంగా రూ.38.15 కోట్ల పర్స్ విలువను కలిగి ఉంది. ఇది కాకుండా హైదరాబాద్ పర్స్ విలువ రూ.34 కోట్లు, కేకేఆర్ రూ.32.7 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.28.95 కోట్లు, పంజాబ్ రూ.29.1 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ రూ.23.25 కోట్లు ఉన్నాయి. ఈ బృందాలు ట్రావిస్ హెడ్‌ని రూ. 20 కోట్లకు కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. మిగిలిన జట్ల పర్స్ విలువ రూ.20 కోట్ల లోపే. ఇటువంటి పరిస్థితిలో, ఏ జట్టు ఏ ధరకు హెడ్‌ని దక్కించుకుంటుందో అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా తరపున మూడు ఫార్మాట్‌లు..

ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా తరపున మూడు ఫార్మాట్‌లు ఆడే ఆటగాడిగా పేరుగాంచాడు. ఇప్పటి వరకు 42 టెస్టులు, 64 వన్డేలు, 23 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టులో 2904 పరుగులు, వన్డేల్లో 2393 పరుగులు చేశాడు. ఇది కాకుండా, IPL కోణం నుంచి చూస్తే, హెడ్ T20 అంతర్జాతీయ రికార్డు కూడా బాగుంది. హెడ్ ​​22 T20I ఇన్నింగ్స్‌లలో 29.15 సగటు, 146.17 స్ట్రైక్ రేట్‌తో 554 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..