IPL 2023: అప్పుడు నెట్ బౌలర్లు.. ఇప్పుడు మ్యాచ్ విన్నర్స్.. లిస్టులో ధోని, కోహ్లీ టీమ్‌మేట్స్.. ఎవరో తెలుసా?
ఐపీఎల్ 2023 మినీ వేలంలో మొత్తం 405 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. వీరిలో కేవలం 80 మందిని మాత్రమే..

ఐపీఎల్ 2023 మినీ వేలంలో మొత్తం 405 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. వీరిలో కేవలం 80 మందిని మాత్రమే ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి. మిగిలిన 325 మంది ప్లేయర్స్‌కు అదృష్టం వరించలేదు. అయితే ఇక్కడ కొంతమంది యువ ఆటగాళ్లు మాత్రం నక్కతోక తొక్కారు. గత సీజన్‌లో నెట్ బౌలర్లుగా అవకాశం దక్కించుకున్న వాళ్లు.. ఈసారి మినీ వేలంలో కోట్లు పలకడం విశేషం. మరి ఆ లక్కీ నెట్ బౌలర్లు ఎవరో చూసేద్దాం పదండి..
-
జాషువా లిటిల్:
ఈ ఐర్లాండ్ యువ లెఫ్టార్మ్ పేసర్ ఐపీఎల్ 15వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున నెట్ బౌలర్‌గా ఎంపిక అయ్యాడు. ఇక ఇప్పుడు మినీ వేలంలో జాషువా లిటిల్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 4.40 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.
-
కుల్వంత్ ఖేజ్రోలియా:
గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు కుల్వంత్ ఖేజ్రోలియా నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు అతడ్ని కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ మినీ వేలంలో రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది.
-
మోహిత్ శర్మ:
గత సీజన్‌లో ఈ టీమిండియా పేసర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అయితే, ఆ తర్వాత ఐపీఎల్ 15వ సీజన్‌కు గుజరాత్ టైటాన్స్ తరపున నెట్ బౌలర్‌గా ఆడాడు. విశేషమేమిటంటే ఈసారి మోహిత్ శర్మను గుజరాత్ టైటాన్స్ రూ.50 లక్షలకు మినీ వేలంలో దక్కించుకుంది.
-
ముఖేష్ కుమార్:
ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నెట్ బౌలర్‌గా ఉన్న ముఖేష్ కుమార్‌కు ఈసారి అదృష్టం వరించింది. మొత్తం రూ. 5.75 కోట్లతో ముఖేష్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీనే కొనుగోలు చేయడం విశేషం.
-
నిషాంత్ సింధు:
ఐపీఎల్ చివరి సీజన్‌లో సీఎస్‌కే తరపున నెట్ బౌలర్‌గా కనిపించిన నిషాంత్ సింధును ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ బౌలర్‌గా తీసుకుంది. రూ. 60 లక్షలతో ఈ యువ ఆటగాడిని సీఎస్‌కే సొంతం చేసుకుంది.