AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘ఢిల్లీ కెప్టెన్’ రిషభ్ పంత్ వచ్చేస్తున్నాడు.. నేడే క్యాపిటల్స్, టైటాన్స్ మ్యాచ్..

రిషభ్ పంత్ ఢిల్లీ జట్టులో లేకపోవడంతో టీమ్‌ని డేవిడ్ వార్నర్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు జరిగే మ్యాచ్‌కి రిషభ్ పంత్ రాబోతున్నాడు. అవును, ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రాజన్

IPL 2023: అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘ఢిల్లీ కెప్టెన్’ రిషభ్ పంత్ వచ్చేస్తున్నాడు.. నేడే క్యాపిటల్స్, టైటాన్స్ మ్యాచ్..
Rishabh Pant
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 04, 2023 | 7:50 AM

Share

ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఈ రోజు జరుగుతున్న  7వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఇక ఇటీవల జరిగిన ప్రమాదం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యూలర్ కెప్టెన్ రిషభ్ పంత్ జట్టులో లేకపోవడంతో టీమ్‌ని డేవిడ్ వార్నర్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు జరిగే మ్యాచ్‌కి రిషభ్ పంత్ రాబోతున్నాడు. అవును, ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) జాయింట్ సెక్రటరీ రాజన్ తెలిపారు. రిషభ్ మ్యాచ్ ఆడలేకపోయినప్పటికీ తన జట్టును ఎంకరేజ్ చేసేందుకు స్టేడియానికి రావాలని పంత్ నిర్ణయించుకున్నాడని ఆయన చెప్పారు. ఆయన మాట్లాడుతూ ‘ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. గాయంతో బాధపడుతున్నా కూడా పంత్ తన ఢిల్లీ జట్టును సపోర్ట్ చేయడానికి ఈ రోజు స్టేడియానికి వస్తున్నాడు. అతడు ఢిల్లీ జట్టులోని స్టార్ క్రికెటర్. పంత్‌ని స్టేడియంలో చూసిన ప్రేక్షకులు అభినందిస్తారని భావిస్తున్నాన’ని రాజన్ పేర్కొన్నారు.

అయితే పంత్ ఫ్రాంఛైజీ ఓనర్స్ ఉండే ప్రాంతం నుంచి మ్యాచ్‌ను వీక్షించడానికి అవకాశం ఉంటుంది. ఒక వేళ బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రత బృందం అనుమతిస్తే కొంత సమయం అతడు డగౌట్‌లో కూడా ఉంటాడని ఆ ఫ్రాంఛైజీ వర్గాలు తెలిపాయి. మరోవైపు పంత్ కోసం స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు. రిషభ్ పంత్‌ను ఇంటి నుంచి స్టేడియానికి తీసుకురావడం, తిరిగి ఇంట్లో డ్రాప్ చేయడానికి కావలసిన తగు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అంతేకాక స్టేడియంలో డగౌట్ వరకూ కూడా పంత్ కోసం ప్రత్యేకమైన ర్యాంప్ ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ సరే అంటే ఏర్పాట్లు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఢిల్లీ జట్టు రెగ్యులర్ కెప్టెన్ అయిన రిషభ్ పంత్ మైదానంలోకి దిగి ఆడకపోయినా.. స్టేడియానికి వచ్చి తమతోపాటు డగౌట్‌లో కూర్చుంటే బాగుంటుందని, టీమ్‌కి ఎంకరేజింగ్‌గా ఉంటుందని టీమ్ కోచ్ రికీ పాంటింగ్ మొదటి నుంచి కూడా అంటున్నారు. ఇప్పుడు ఆయన కోరిక మేరుకు పంత్ నేరుగా స్టేడియానికి వస్తున్నాడు. ఇక రిషభ్ పంత్ గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి క్రికెట్ అభిమానులకు తెలిసిందే. అయితే పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఊతకర్రలతో మెల్లిగా నడవగలుగున్నాడు. కానీ పంత్ ఇప్పట్లో క్రికెట్ ఆడలేడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..