IPL 2023: మహిళల జెర్సీలతో బరిలోకి ముంబై ప్లేయర్స్ .. మ్యాచ్ చూడనున్న19 వేల మంది అమ్మాయిలు.. నీతా అంబానీ ప్రత్యేక ఏర్పాట్లు

|

Apr 16, 2023 | 8:36 AM

రిలయన్స్ ఇండస్ట్రీస్  ఆధ్వర్యంలో నడిచే ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ క్యాంపెయిన్ (ESA) లో భాగంగా ముంబై ఆటగాళ్లు ఈ జెర్సీని ధరించననున్నారు. అమ్మాయిలకు విద్య, క్రీడల్లో తగినంత ప్రోత్సాహం కల్పిస్తూ వారికి కావాల్సిన మద్దతును అందివ్వడం ఈఎస్ఏ ప్రధాన ఉద్దేశం.

IPL 2023: మహిళల జెర్సీలతో బరిలోకి ముంబై ప్లేయర్స్ .. మ్యాచ్ చూడనున్న19 వేల మంది అమ్మాయిలు.. నీతా అంబానీ ప్రత్యేక ఏర్పాట్లు
Mumbai Indians
Follow us on

IPL 2023 లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌16) ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జెర్సీతో బరిలోకి దిగనున్నారు. రోహిత్ సేన ఇలా ముంబై ఇండియన్స్ మహిళల జెర్సీ ధరించడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్  ఆధ్వర్యంలో నడిచే ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ క్యాంపెయిన్ (ESA) లో భాగంగా ముంబై ఆటగాళ్లు ఈ జెర్సీని ధరించననున్నారు. అమ్మాయిలకు విద్య, క్రీడల్లో తగినంత ప్రోత్సాహం కల్పిస్తూ వారికి కావాల్సిన మద్దతును అందివ్వడం ఈఎస్ఏ ప్రధాన ఉద్దేశం. ఈఎస్ఏ ఫౌండేషన్ డే ను పురస్కరించుకుని అమ్మాయిల్లో స్ఫూర్తిని నింపేందుకు గాను ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ఇవాళ మహిళల జెర్సీతో మ్యాచ్‌ ఆడనున్నారు.

లక్ష ఫుడ్ ప్యాకెట్లు..

కాగా ఈ స్పెషల్‌ మ్యాచ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నీతా అంబానీ తెలిపారు. 36 ఎన్జీవోలలోని 19 వేల మంది చిన్నారులకు ప్రత్యక్షంగా మ్యాచ్ చూపించనున్నారు. ఇందులో 200 మంది దివ్యాంగుల పిల్లలు కూడా ఉన్నారు. చిన్నారులను వాంఖెడే మైదానానికి తరలించడానికి 500 ప్రైవేట్ బస్సులు, 2 వేల మంది స్పెషల్‌ వాలంటీర్లను సిద్దం చేసింది. అంతేకాదు వీరికి ఆహారం అందించేందుకు కూడా ఒక లక్ష ఫుడ్ ఫ్యాకెట్లు, వాటర్‌ ఫెసిలిటీ సదుపాయాన్ని కూడా కల్పించింది. మ్యాచ్ చూడటానికి వచ్చే పిల్లలంతా ఈఎస్ఏ టీ షర్ట్ లతో ముంబై టీంను ఎంకరేజ్ చేయనున్నాయి.

ఇవి కూడా చదవండి

టాస్‌కు రోహిత్‌ తో పాటు హర్మన్‌

కాగా ఈ మ్యాచ్ కు అమ్మాయిల తరపున ముంబై ఇండియన్స్ మహిళా జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్ కూడా సందడి చేయనుంది. అలాగే మ్యాచ్‌ టాస్ వేసే సమయంలో రోహిత్‌తో పాటు హర్మన్‌ కూడా హాజరుకానుంది. నీతా అంబానీ పేర్కొన్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..