Viral Video: బ్యాటింగ్ చేసేందుకు ఎంట్రీ ఇచ్చిన ఓపెనర్స్.. కట్‌చేస్తే.. మైదానంలోకి అనుకోని అతిథి.. ఆగిన మ్యాచ్..
CSK vs LSG: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు చెన్నై చేపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక వింత కనిపించింది. ప్రపంచంలోని అన్ని క్రికెట్ గ్రౌండ్స్‌లో ఈ విషయం కనిపించినా.. కిక్కిరిసిన చెన్నై మైదానంలో ఇలా జరగడం మాత్రం ఆశ్చార్యానికి గురిచేసింది.

IPL 2023, CSK vs LSG: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు చెన్నై చేపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక వింత కనిపించింది. ప్రపంచంలోని అన్ని క్రికెట్ గ్రౌండ్స్‌లో ఈ విషయం కనిపించినా.. కిక్కిరిసిన చెన్నై మైదానంలో ఇలా జరగడం మాత్రం ఆశ్చార్యానికి గురిచేసింది. మూడేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ జరగనుండడంతో అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలోకి ప్రవేశించిన ఓ కుక్క.. అందరినీ పరుగులు పెట్టించేలా చేసింది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలయ్యేందుకు కారణమైంది.
IPL 2023లో చెన్నై వర్సెస్ లక్నో మధ్య జరుగుతోన్న ఈ ఏడవ మ్యాచ్‌లో, టాస్ తర్వాత, చెన్నై ఓపెనర్స్ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి ఎంట్రీ ఇచ్చారు. లక్నో బౌలర్ మొదటి బంతిని వేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతలో ఒక కుక్క మైదానంలోకి ప్రవేశించి భద్రతా సిబ్బందిని పరుగులు పెట్టించింది. మైదానం అంతటా తిప్పేలా చేసింది. ఆ కుక్కను మైదానం బయటకు పంపించేందుకు ఎంతగానో శ్రమించాల్సి రావడంతో మ్యాచ్ 5 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.




Delayed because of this dog ?#CSKvsLsg pic.twitter.com/wpce5bz0vu
— PHENOMENAL?? (@Phenomenall___) April 3, 2023
మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడేళ్ల తర్వాత తిరిగి సొంతగడ్డపైకి వచ్చింది. కోవిడ్ -19 కారణంగా, ఐపీఎల్ మూడేళ్లపాటు నిర్వహిస్తున్నారు. చెన్నై ఆటగాళ్ల ఆటను చూసేందుకు సిద్ధమైన ప్రేక్షకులను ఈ కుక్క మరింత వెయిట్ చేయించింది. మొత్తానికి, పసుపు జెర్సీలు ధరించి వేలాది మంది అభిమానుల మధ్య మరోసారి అతని జట్టు చెపాక్ మైదానంలో ఆడుతోంది.
Dog interrupted the game for a while at Chepauk. #cskvlsg #CSKvsLSG pic.twitter.com/CiAbmQopII
— rajendra tikyani (@Rspt1503) April 3, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
