AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuvraj Singh: వైరల్‌ అవుతున్న శుభ్‌మన్‌ గిల్‌ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌.. తీవ్రంగా స్పందించిన యువరాజ్‌ సింగ్‌..!

ఐపీఎల్‌ 2022 (IPL 2022)లో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌(shubman gill) ప్లాఫ్‌ షో కొనసాగుతోంది. గిల్‌ విఫలమవుతున్నప్పటికీ జట్టు మ్యాచ్‌లు గెలవడంతో అతనిపై జట్టు యాజమాన్యం సానుకూలంగా ఉంది...

Yuvraj Singh: వైరల్‌ అవుతున్న శుభ్‌మన్‌ గిల్‌ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌.. తీవ్రంగా స్పందించిన యువరాజ్‌ సింగ్‌..!
Yuvaraj Singh
Srinivas Chekkilla
|

Updated on: Apr 30, 2022 | 6:00 AM

Share

ఐపీఎల్‌ 2022 (IPL 2022)లో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌(shubman gill) ప్లాఫ్‌ షో కొనసాగుతోంది. గిల్‌ విఫలమవుతున్నప్పటికీ జట్టు మ్యాచ్‌లు గెలవడంతో అతనిపై జట్టు యాజమాన్యం సానుకూలంగా ఉంది. అయితే శుభమాన్ గిల్‌ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌పై మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌(Yuvraj Singh) తీవ్రంగా స్పందించాడు. ఇప్పుడు ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో(Social Media) వైరల్‌ అవుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ విజయంపై శుభ్‌మన్ గిల్ పోస్ట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో శుభమాన్ గిల్ ‘మీకు వినోదం కావాలంటే గుజరాత్ టైటాన్స్‌కు కాల్ చేయండి’ అని రాశారు. దీనిపై యువరాజ్ సింగ్ చెప్పు ఎమోజీని తయారు చేశాడు. మీ షాట్ వినోదాత్మకంగా ఉంది’ అని కూడా వ్యాఖ్యానించాడు. శుభ్‌మన్ గిల్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 22 పరుగులు చేసి ఔటయ్యాడు.

Yuvraj

Yuvraj

క్రీజులో స్థిరపడిన తర్వాత ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతిని బ్యాడ్ షాట్ ఆడి బౌల్డ్ అయ్యాడు. యువరాజ్ తన షాట్ ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ హైదరాబాద్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. చివరి ఓవర్‌లో రషీద్, తెవాటియా నాలుగు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించారు. ఐపీఎల్ 2022లో 8 మ్యాచ్‌లు ఆడిన శుభ్‌మన్ గిల్ 229 పరుగులు చేశాడు. గిల్ బ్యాటింగ్ సగటు 28.62. అతని బ్యాట్‌లో రెండు అర్ధ సెంచరీలు వచ్చాయి.. కానీ అతను గత 6 ఇన్నింగ్స్‌లలో ఫ్లాప్ అయ్యాడు. గిల్ రెండుసార్లు సున్నాకి ఔటయ్యాడు.

Read Also.. IPL 2022 Orange Cap: టాప్‌ 5 లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్‌ అయ్యర్.. బట్లర్‌కి ఇక పోటీ తప్పదు..!