IPL 2022: అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రిటెన్షన్‌ లిస్ట్ రెడీ.. జాబితాలో ఇద్దరు టీమిండియా యంగ్ ప్లేయర్లు?

IPL 2022: అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రిటెన్షన్‌ లిస్ట్ రెడీ.. జాబితాలో ఇద్దరు టీమిండియా యంగ్ ప్లేయర్లు?
Ipl Mega Auction 2022

Indian Premier League: అహ్మదాబాద్ ఫ్రాంచైజీ మొదటిసారిగా IPLలో భాగం అవుతోంది. హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్ ఈ జట్టులో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Venkata Chari

|

Jan 18, 2022 | 3:31 PM

IPL Mega Auction 2022: ఐపీఎల్ 2022(IPL 2022) కి ముందు , అహ్మదాబాద్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యా(Hardik Pandya), ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్, శుభ్‌మాన్ గిల్‌లను చేర్చుకోవడానికి సన్నాహాలు చేసింది. ఈ టీమ్‌లో హార్దిక్, రషీద్ చేరినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే శుభ్మన్ పేరు ఈ లిస్టులో చేరడం షాకింగ్‌గా మారింది. మూడో ఎంపికగా ఇషాన్ కిషన్‌(Ishan Kishan)కు బదులుగా భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు జట్టు ప్రాధాన్యతనిచ్చింది. వార్తా సంస్థ పీటీఐ ప్రకారం, ఫ్రాంచైజీ మొదట ఇషాన్ కిషన్‌ను మూడవ ఆటగాడిగా లిస్టులో చేర్చారు. భవిష్యత్తులో జట్టుకు నాయకత్వం వహించగల గిల్‌ని ఎంచుకోవడం వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

ఒక సీనియర్ ఐపిఎల్ అధికారి పీటీఐతో మాట్లాడుతూ, “అహ్మదాబాద్ తన ఆటగాళ్లను ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని బీసీసీఐ (క్రికెట్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కి తెలియజేసింది.” హార్దిక్‌, రషీద్‌, శుభ్‌మన్‌ ముగ్గురు తన ఫేవరెట్‌ ఆటగాళ్లుగా ఎంచుకుంది. అహ్మదాబాద్ జట్టు కూడా కిషన్‌ను జట్టులోకి తీసుకోవాలని కోరుకుంది. అయితే అతను మళ్లీ వేలంలోకి వెళ్లడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. అతని కోసం ముంబై ఇండియన్స్ భారీ వేలం వేసే అవకాశం ఉంది.

రిటెన్షన్ సమయంలో ముంబై టీం రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను ఎంపిక చేసింది. వేలంలో చాలా మంది పెద్ద ఆటగాళ్లు పాల్గొంటారు. అంతకుముందు ముంబై తన ఆటగాళ్లను మళ్లీ బిడ్‌లో తీసుకుంటుందని నమ్ముతున్నారు. అయితే ఇతర టీమ్‌లు కూడా వారిపై దృష్టి పెట్టాయి.

ఇషాన్ దూకుడుకి మారుపేరు.. ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ రెండు జట్లకు మాత్రమే ఆడాడు. అతని ఆట గుజరాత్‌కు బాగా రాణిస్తోంది. కానీ, ముంబైలో అతని బ్యాట్ బాగానే పరుగులు రాబట్టింది. IPL 2020 సమయంలో, ఇషాన్ అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆ సమయంలో 30 సిక్సర్లు కొట్టి 516 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఇలాంటి ప్రదర్శన కారణంగా ఇషాన్ భారత జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. దూకుడుకి మారుపేరుగా నిలిచిన బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. అలాగే కీపర్‌గాను ఆకట్టుకుంటున్నాడు.

ఇషాన్‌ కిషన్‌ను తీసుకునేందుకు మిగతా టీమ్‌లలో ఉత్సుకత నెలకొంటుందని భావిస్తున్నారు. అతనికి ప్రస్తుతం 23 ఏళ్లు మాత్రమే. ఇలాంటి పరిస్థితిలో, జట్లు అతన్ని భవిష్యత్ కెప్టెన్‌గా కూడా ఎంచుకునే ఛాన్స్ ఉంది. 2016లో భారత అండర్ 19 జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఇషాన్ కిషన్ నాయకత్వంలో జట్టు ఫైనల్‌కు చేరుకుంది. రిషబ్ పంత్ కూడా అతనికి జోడీగా ఉన్నాడు.

Also Read: IND vs SA ODI Series: దక్షిణాఫ్రికాలో పరుగుల వర్షం.. వన్డే లిస్టులో టాప్‌లో ఎవరున్నారంటే?

IPL 2022 Mega Auction: ఆ ‘రూట్’ లోనే స్టార్ క్రికెటర్లు.. ఐపీఎల్ మెగా వేలానికి దూరం కానున్న ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లు!..

IND vs WI: వెస్టిండీస్‌ సిరీస్‌తో రంగంలోకి రోహిత్.. కోహ్లీ స్థానంపై అనుమానాలు? ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu