IND vs SA ODI Series: దక్షిణాఫ్రికాలో పరుగుల వర్షం.. వన్డే లిస్టులో టాప్‌లో ఎవరున్నారంటే?

Virat Kohli: జనవరి 19 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ జరగనుంది. ఇందులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటతీరు జట్టుకు పట్టం కట్టనుంది.

IND vs SA ODI Series: దక్షిణాఫ్రికాలో పరుగుల వర్షం.. వన్డే లిస్టులో టాప్‌లో ఎవరున్నారంటే?
Rohit Sharma and Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Jan 18, 2022 | 2:52 PM

India vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా(IND vs SA) మధ్య జనవరి 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ పార్ల్‌లో జరగనుంది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లి(Virat Kohli) ఆటతీరు భారత శిబిరానికి ఎంతో మేలు చేస్తుంది. విరాట్ ఇంతకుముందు ఇక్కడ వన్డే సిరీస్‌లో ఆడాడు. విరాట్‌తో పాటు అందరి దృష్టి కూడా కేఎల్ రాహుల్(KL Rahul), శిఖర్ ధావన్, రితురాజ్ గైక్వాడ్‌లపైనే ఉంటుంది. రేపటి నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్‌ సందర్భంగా దక్షిణాఫ్రికాలో విరాట్ ఆటతీరును ఓసారి పరిశీద్దాం..

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి దక్షిణాఫ్రికాలో ఆడిన అనుభవం ఉండటంతో ఈ సిరీస్‌లో అది అతనికి ఉపయోగపడనుందనడంలో సందేహం లేదు. విరాట్ ఇప్పటివరకు ఇక్కడ ఆడిన 17 మ్యాచ్‌ల్లో 877 పరుగులు చేశాడు. ఈ సమయంలో కోహ్లి 87.7 సగటుతో పరుగులు సాధించాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కోహ్లి దక్షిణాఫ్రికాలో 3 సెంచరీలు కూడా చేశాడు. కోహ్లి ఓవరాల్ ప్రదర్శనను పరిశీలిస్తే.. దక్షిణాఫ్రికాతో ఆడిన మొత్తం 27 మ్యాచ్‌ల్లో 1287 పరుగులు చేశాడు.

సచిన్ టెండూల్కర్ దక్షిణాఫ్రికాతో వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్ 57 మ్యాచ్‌ల్లో 2001 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే ఈ కాలంలో సచిన్ 5 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. అదే సమయంలో, సౌరవ్ గంగూలీ 29 మ్యాచ్‌ల్లో 1313 పరుగులు చేశాడు. గంగూలీ 3 సెంచరీలు, 8 సెంచరీలు కూడా చేశాడు. రాహుల్ ద్రవిడ్ 36 మ్యాచ్‌ల్లో 1309 పరుగులు చేశాడు. ద్రవిడ్ 14 అర్ధ సెంచరీలు కూడా చేశాడు.

Also Read: IND vs WI: వెస్టిండీస్‌ సిరీస్‌తో రంగంలోకి రోహిత్.. కోహ్లీ స్థానంపై అనుమానాలు? ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్..

IND vs SA: జనవరి 19 నుంచి భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ మొదలు.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?