IPL 2022 Orange Cap: టాప్ టెన్‌లోకి దూసుకొచ్చిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్.. కానీ జోస్ బట్లర్‌ని చేరుకోవడం అంత సులువు కాదు..!
IPL 2022 Orange Cap: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌లో పరుగుల వర్షం కురుస్తోంది. కొంతమంది బ్యాటర్లు ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు.
IPL 2022 Orange Cap: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌లో పరుగుల వర్షం కురుస్తోంది. కొంతమంది బ్యాటర్లు ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. మంగళవారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా పరుగుల వర్షం కురిసింది. ఈసారి హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి చెలరేగిపోయాడు. హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. దీంతో పాటు ఆరెంజ్ క్యాప్ రేసులో రాహుల్ టాప్-10లోకి ప్రవేశించాడు. రాహుల్ ముంబైపై నంబర్-3లో బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. ముంబై అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రాను కూడా వదిలిపెట్టలేదు. అతడి బౌలింగ్‌లో కూడా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 44 బంతులు ఎదుర్కొని 73 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.
రాహుల్ తన సత్తా చాటాడు
ఈ ఇన్నింగ్స్ వల్ల రాహుల్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 8వ స్థానంలో నిలిచాడు. రాహుల్ 13 మ్యాచ్‌ల్లో 393 పరుగులు చేశాడు. అతని సగటు 39.30. రాహుల్ 161.72 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో రాహుల్ మూడు సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ముంబైపై చేసిన స్కోరు ఈ సీజన్‌లో అతని అత్యధిక స్కోరు. జట్టులోని అభిషేక్ శర్మ 10వ స్థానంలో ఉన్నాడు. 13 మ్యాచ్‌ల్లో 383 పరుగులు చేశాడు.
ఆరెంజ్ క్యాప్ రేసులో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన జోస్ బట్లర్ ముందంజలో ఉన్నాడు. 13 మ్యాచ్‌ల్లో 627 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో బట్లర్ మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. కేఎల్ రాహుల్ రెండో స్థానంలో ఉన్నాడు. 13 మ్యాచ్‌లు ఆడి 469 పరుగులు చేశాడు. మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన డేవిడ్ వార్నర్ ఉన్నాడు. ఇతడు 11 మ్యాచ్‌ల్లో 427 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో శిఖర్ ధావన్ ఉన్నాడు. 13 మ్యాచ్‌ల్లో 421 పరుగులు చేశాడు. దీపక్ హుడా ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.13 మ్యాచ్‌ల్లో 406 పరుగులు చేశాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి