IPL 2022: లోగో విడుదల చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. అందులో ఏముందంటే..

ఐపీఎల్-2022లో పాల్గొనబోయే కొత్త టీం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తమ లోగోను విడుదల చేసింది...

IPL 2022: లోగో విడుదల చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. అందులో ఏముందంటే..
Lucknow Super
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 31, 2022 | 8:23 PM

ఐపీఎల్-2022లో పాల్గొనబోయే కొత్త టీం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తమ లోగోను విడుదల చేసింది. లోగోలో గరుడ పక్షి రెక్కల ఆకారంలో డిసైన్ చేసి దానికి కింద లక్నో సూపర్ జెయింట్స్ అని రాశారు. గరుడ పక్షి ప్రతి భారతీయ సంస్కృతిలో భాగమని” అని LSG ఒక ప్రకటనలో తెలిపింది. “గరుడ పక్షి రెక్కలు మూడు-రంగుల్లో ఉన్నాయి. క్రికెట్ ఆటను సూచించడానికి పక్షి శరీరం నీలం రంగు బ్యాట్‌తో రూపొందించబడింది, నారింజ రంగు సీమ్‌తో ఎరుపు బంతి ఉంది. ఇది శుభప్రదమైన ‘జయ్ తిలకం’ లాంటిది” అని జోడించారు.

IPL 2022 కోసం KL రాహుల్ (రూ. 17 కోట్లు), మార్కస్ స్టోయినిస్ (రూ. 9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ. 4 కోట్లు)తో కొనుగోలు చేసింది. లక్నో జెయింట్స్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తున్నాడు. ఆండీ ఫ్లవర్ ఇప్పటికే లక్నో ఫ్రాంచైజీకి కోచ్‌గా ఎంపికయ్యాడు. భారత మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ ఫ్రాంచైజీకి మెంటార్‌గా వ్యవహరిస్తాడు.

Read Also.. IND vs WI: అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత జట్టు.. బయో బబుల్‌లోకి వెళ్లిన ఆటగాళ్లు..