CSK vs KKR: కోల్‌కతా టార్గెట్ 132.. హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన ధోనీ..
IPL 2022: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 132 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
ఐపీఎల్(IPL 2022) తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య (Chennai Super Kings vs Kolkata Knight Riders)ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్‌కతా టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వాంఖడేలో ముందుగా బౌలింగ్ చేసే టీం లాభపడుతుందని మరోసారి రుజువైంది. కోల్‌కతా బౌలర్ల దెబ్బకు చెన్నై టీం వరుసగా వికెట్లు కోల్పోతూ తొలిమ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడిన చెన్నై టీం తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 125 పరగులు సాధించింది. దీంతో కోల్‌కతా ముందు 121 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. చెన్నై బ్యాట్స్‌మెన్స్‌లో ఎంఎస్ ధోనీ 50(38 బంతులు, 7 ఫోర్లు, 1 సిక్స్), రాబిన్ ఊతప్ప 28(21 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు), అంబటి రాయుడు 15, రవీంద్ర జడేజా 26, గైక్వాడ్ 0, కాన్వే 3, శివం దూబే 3, ధోనీ 2 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ 2, చక్రవర్తి, రస్సెల్ తలో వికెట్ పడగొట్టారు.
రెండు జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్(కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా(కెప్టెన్), శివమ్ దూబే, ఎంఎస్ ధోని(కీపర్), డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, తుషార్ దేశ్‌పాండే