IPL 2022: నీ దూకుడూ.. సాటెవ్వడు.. ఆకాశమే హద్దుగా చెలరేగుతోన్న RR ప్లేయర్.. కోహ్లీ రికార్డుకు ఎసరు?
Jos Buttler: ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ (Jos Buttler) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో శతక్కొట్టిన ఈ పింక్ ఆర్మీ ఆటగాడు తాజాగా మరోసారి మూడంకెల స్కోరును అందుకున్నాడు.
Jos Buttler: ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ (Jos Buttler) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో శతక్కొట్టిన ఈ పింక్ ఆర్మీ ఆటగాడు తాజాగా మరోసారి మూడంకెల స్కోరును అందుకున్నాడు. సోమవారం రాత్రి కేకేఆర్ (RR vs KKR) తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 59 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా ఈమ్యా్‌చ్‌లో మొత్తం 103 పరుగులు సాధించిన బట్లర్ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఒకే ఐపీఎల్ సీజన్‌లో రెండు సెంచరీలు బాదిన ఐదో ఆటగాడు బట్లర్. గతంలో క్రిస్ గేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 2011), హషీమ్ ఆమ్లా (2017లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్), షేన్ వాట్సన్ (2018 చెన్నై సూపర్ కింగ్స్ తరఫున), శిఖర్ ధావన్ (2020 ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున) ఒకే ఎడిషన్‌లో రెండు సెంచరీలు బాదారు. ఐపీఎల్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు మాత్రం కింగ్‌కోహ్లీదే. అతను 2016లో ఏకంగా నాలుగు సార్లు మూడంకెల స్కోరు అందుకున్నాడు.
కాగా ఓవరాల్‌గా ఐపీఎల్‌లో బట్లర్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఇక టీ20 స్పెషలిస్ట్ గా పేరొందిన ఈ ఇంగ్లండ్ ఆటగాడు గత 23 టీ20 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా నాలుగు శతకాలు బాదాడు. ఇక ఐపీఎల్‌లో భాగంగా బ్రబౌర్న్ స్టేడియంలో సెంచరీ బాదిన నాలుగో ఆటగాడిగా బట్లర్ మరో రికార్డును అందుకున్నాడు. ఇంతకుముందు యూసుఫ్ పఠాన్, షేన్ వాట్సన్, కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. కాగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఈ పింక్ ఆర్మీ ప్లేయర్ మొత్తం 375 పరుగులు చేశాడు. తద్వారా ఆరెంజ్ క్యాప్ రేసులో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
If you do it once, you’re great. If you do it twice, you’re Jos Buttler. ? pic.twitter.com/2Yb1EJtqrA
— Rajasthan Royals (@rajasthanroyals) April 18, 2022
BIS Recruitment: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో 337 ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Viral: ఆ పని చేస్తుండగా దెబ్బతిన్న ఊపిరితిత్తులు.. టెస్టులు చేసిన డాక్టర్ల ఫ్యూజులు ఔట్!