IPL 2022: క్రికెటర్లే కాదు.. కామెంటేటర్లు కూడా కోటీశ్వరులే.. ఒక్కొక్కరు ఎంత తీసుకోనున్నారో తెలుసా?
IPL 2022: క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్-2022 సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది.
IPL 2022: క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్-2022 సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతోన్న మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తలపడనున్నాయి. కాగా క్రికెట్‌లో క్యాష్ రిచ్ లీగ్‌గా ఐపీఎల్‌కు పేరుంది.అందుకు తగ్గట్లే కోట్లు ఖర్చుబెట్టి మరీ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి ఆయా ఫ్రాంఛైజీలు. అయితే వీరితో పాటు ఐపీఎల్‌లో కామెంటరీ చేసే వ్యాఖ్యాతలు కూడా కోట్ల రూపాయలను అందుకోనున్నారు. హిందీ, ఇంగ్లిషుతో సహా వివిధ భాషలలో కామెంటరీ చేసే వారికి కోట్లలో రెమ్యునరేషన్ అందిస్తోంది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. కాగా ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను ‘స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్’ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
మొత్తం 8 భాషల్లో.. కాగా ఐపీఎల్-2022లో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, అంజుమ్ చోప్రా, హర్భజన్ సింగ్, సురేశ్ రైనాతో సహా మొత్తం 80 మంది కామెంటేటర్లు పాల్గొననున్నారు. ఈ బృందం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోని మొత్తం 24 ఛానెళ్లలో 8 భాషల్లో కామెంటరీ చేయనున్నారు. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు మరాఠీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళం, మలయాళ భాషలలో వీరు తమ గళం వినిపించనున్నారు.
హిందీ కామెంటేటర్ల బృందంలో.. హిందీ కామెంటేటర్ల బృందంలో రవిశాస్త్రి, ఆకాష్ చోప్రా, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, సురేష్ రైనా, కిరణ్ మోర్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, పీయూష్ చావ్లా, నిఖిల్ చోప్రా, మయంతి లాంగర్, జతిన్ సప్రూ, సురేన్ సుందరం, తాన్యా పురోహిత్ ఉన్నారు. వీరు దాదాపు రూ. 61 లక్షల నుంచి రూ. 2.67 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకోనున్నారు.
ఎవరెవరు ఎంతెంతంటే.. *ఆకాష్ చోప్రా – రూ 2.6 కోట్లు *సురేష్ రైనా – 1.5 కోట్లు *కిరణ్ మోర్ – రూ. 1.5 కోట్లు *హర్భజన్ సింగ్ – రూ. 1.5 కోట్లు * ఇర్ఫాన్ పఠాన్ – 1.5 కోట్లు
సునీల్ గవాస్కర్ తో సహా.. ఇక ఇంగ్లిష్ కామెంటేటర్ల బృందంలో సునీల్ గవాస్కర్, హర్షా భోగ్లే, లక్ష్మణ్ శివరామకృష్ణన్, అంజుమ్ చోప్రా, మురళీ కార్తీక్, దీప్ దాస్‌గుప్తా, ఇయాన్ బిషప్, అలాన్ విల్కిన్స్, మార్క్ నికోల్స్, మైఖేల్ స్లేటర్, నిక్ నైట్, డానీ మోరిసన్, డల్. , మాథ్యూ హేడెన్, కెవిన్ పీటర్సన్, మోర్నే మోర్కెల్, గ్రేమ్ స్మిత్, గ్రేమ్ స్వాన్, WV రామన్, డారెన్ గంగా తదితరులు ఉన్నారు. వీరు IPL మొత్తం సీజన్‌కు గాను దాదాపు రూ.1.9 కోట్ల నుంచి రూ. 3.8 కోట్ల వరకు అందుకోనున్నారు. అదేవిధంగా సునీల్ గవాస్కర్, హర్షా భోగ్లే, లక్ష్మణ్ శివరామకృష్ణన్, కెవిన్ పీటర్సన్, ఇయాన్ బిషప్, మార్క్ నికోల్స్, మైఖేల్ స్లేటర్‌లకు రూ.3.8 కోట్లు, దీప్ దాస్‌గుప్తా రూ. 2.6 కోట్లు, మురళీ కార్తీక్, అంజుమ్ చోప్రా రూ. 1.9 కోట్లు అందుకోనున్నారు.
ఏయే భాషల్లో ఎవరెవరంటే.. తెలుగు: MSK ప్రసాద్, వేణుగోపాలరావు, KN చక్రవర్తి, S ఆవులాయిపల్లి, T సుమన్, కృష్ణ, N మచ్చ, VV మేడపాటి, A రెడ్డి, కళ్యాణ్ కృష్ణ
బెంగాలీ: సంజీబ్ ముఖర్జీ, దేబాశిష్ దత్తా, జోయ్‌దీప్ ముఖర్జీ, గౌతమ్ భట్టాచార్య, సరదిందు ముఖర్జీ, సౌరాశిష్ లాహిరి
గుజరాతీ : నయన్ మోంగియా, మనన్ దేశాయ్, మన్‌ప్రీత్ జునేజా, కరణ్ మెహతా, ధ్వనిత్ థాకర్ మరియు ఆకాష్ త్రివేది.
మరాఠీ: సందీప్ పాటిల్, ప్రసన్న సంత్, వినోద్ కాంబ్లీ, అమోల్ ముజుందార్, కునాల్ డేట్, చైతన్య సంత్. స్నేహల్ ప్రధాన్.
తమిళం: K శ్రీకాంత్, S బద్రీనాథ్, రస్సెల్ ఆర్నాల్డ్, రాధాకృష్ణన్ శ్రీనివాసన్, KV సత్యనారాయణన్, అభినవ్ ముకుంద్, భావన బాలకృష్ణన్, ముత్తురామన్ R, RJ బాలాజీ, విష్ణు హరిహరన్, యోమహేష్ విజయకుమార్, R సతీష్.
కన్నడ: వెంకటేష్ ప్రసాద్, విజయ్ భరద్వాజ్, కిరణ్ శ్రీనివాస్, జికె అనిల్ కుమార్, సుమేష్ గోని, రీనా డిసౌజా, పవన్ దేశ్‌పాండే, ఆర్ వినయ్ కుమార్, వేద కృష్ణమూర్తి, భరత్ చిప్లి, మధు మలంకోడి, శ్రీనివాస మూర్తి పి, భరత్ చిప్లి, అఖిల్ బాలచంద్ర.
మలయాళం : టిను యోహన్నన్, విష్ణు హరిహరన్, షియాస్ మహమ్మద్, రాపి గోమెజ్, CM దీపక్. Also Read:Pakistan PM Imran Khan: విశ్వాస పరీక్షకు ముందే గద్దె దిగనున్న పాక్ ప్రధాని?.. రేపు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం..
AP Govt Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో.. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా!