AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Auction: ఈ 5గురి కోసం ముంబై ఎదురుచూపులు.. లిస్టులో u19 ప్లేయర్ కూడా?

Mumbai Indians: ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరగనున్న IPL మెగా వేలంలో ముంబై ఇండియన్స్ కీలకమైన 5గురు ప్లేయర్లతో బరిలోకి దిగాలని చూస్తోంది. ఆ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం.

IPL 2022 Auction: ఈ 5గురి కోసం ముంబై ఎదురుచూపులు.. లిస్టులో u19 ప్లేయర్ కూడా?
Mumbai Indians
Venkata Chari
|

Updated on: Feb 11, 2022 | 8:42 PM

Share

IPL 2022 Auction: ఐపీఎల్(IPL) 2022 వేలానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు అన్ని జట్లు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన ముంబయి ఇండియన్స్(Mumbai Indians) జట్టు లీగ్‌లో వారి భవిష్యత్తు కోసం ఎంతో ప్లాన్ చేసుకుంటుంది. లీగ్‌లో ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ తమ నలుగురి ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. అయితే వారు తమ జట్టులో పటిష్టమైన జట్టును కలిగి ఉన్నారు. వారి కోర్ గ్రూప్‌ను తిరిగి పొందడానికి మంచి వ్యూహాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), పేస్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా, ప్రతిభావంతులైన సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్‌లను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే అహ్మదాబాద్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాను ఎంచుకోవడంతో ఈ ఆలౌ రౌండర్‌ను మిస్ చేసుకుంది.

ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా..

ముంబై ఇండియన్స్ (మిగిలిన పర్సు – రూ. 48 కోట్లు): రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు) జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు) సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు) కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు)

ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ తీసుకోవాలనుకుంటున్న ప్లేయర్లు:

1. ట్రెంట్ బౌల్ట్ (గరిష్టంగా రూ. 4 కోట్లు): కివీ పేస్ బౌలర్ ముంబై ఇండియన్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పవర్‌ప్లేలో వేగంగా వికెట్లు పడగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బుమ్రాతో అతని భాగస్వామ్యం అనూహ్యంగా ఉంది. అతనిని తిరిగి పొందడానికి ముంబై జట్టు ఎదురుచూస్తోంది.

2. ఇషాన్ కిషన్ (గరిష్టంగా రూ. 3.5 కోట్లు): కీపర్ కం బ్యాటర్ ముంబై ఇండియన్స్ జట్టులో కీలకమైన ప్లేయర్. హార్దిక్ లిస్టు నుంచి తప్పుకోవడంతో ఇషాన్‌ను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది. రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సమస్యలతో కిషన్ ఓపెనింగ్‌లో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటాడు.

3. యుజ్వేంద్ర చాహల్ (గరిష్టంగా రూ. 5 కోట్లు): ముంబై ఇండియన్స్ బలహీనంగా ఉన్న ఏకైక విభాగం స్పిన్. చాహల్ సంవత్సరాలుగా IPLలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. చాహల్‌ను తిరిగి పొందేందుకు ఆర్‌సీబీ తీవ్రంగా పోటీపడుతుందని తెలిసిందే. అయితే ముంబయి మాత్రం కోహ్లి టీం నుంచి తప్పించేందుకు ట్రై చేస్తోంది.

4. జాసన్ హోల్డర్ (గరిష్టంగా రూ. 6 కోట్లు): కీరన్ పొలార్డ్ కెరీర్ చివరి దశలో ఉన్నాడు. రాబోయే సంవత్సరాల్లో హోల్డర్ అద్భుతమైన స్థానంలో ఉంటాడనడంలో సందేహం లేదు. అతను వికెట్లు తీయడంతోపాటు, కీలకమైన సమయంలో పరుగులు కూడా చేయగలడు.

5. యష్ ధుల్ (గరిష్టంగా రూ. 50 లక్షలు): U19 ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్‌గా ఐపీఎల్ వేలంలో నిలిచాడు. టీమిండియా కోసం గొప్ప బ్యాటర్ అయ్యే అవకాశం ఉందంటూ భావిస్తున్నారు. ముంబై ఇండియన్స్ అతనికి నేర్చుకోవడానికి, ఎదగడానికి సరైన అవకాశాన్ని అందించగలదని భావిస్తోంది.

Also Read: IPL 2022 Auction: కేకేఆర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా.. వేలంలో ఈ 5గురు సొంతమయ్యేనా?

IPL 2022 Auction: ఈ 5గురిపైనే హైదరాబాద్ చూపు.. వార్నర్ స్థానం భర్తీ చేసేదెవరు.. కొత్త జెర్సీతోనైనా లక్ మారేనా?