IPL 2022 Mega Auction: 590 మందితో తుది జాబితా..  రూ.2 కోట్ల కేటగిరిలో ఐదురుగు భారత ఆటగాళ్లు..

బీసీసీఐ(bcci) 590 మంది ఆటగాళ్లతో వేలం కోసం తుది జాబితాను ప్రకటించింది. రాబోయే IPL 2022 మెగా వేలం(IPL 2022 Mega Auction) కోసం. తాజాగా ఆ జాబితాలో జోఫ్రా ఆర్చర్(archar) కూడా చేరాడు.

IPL 2022 Mega Auction: 590 మందితో తుది జాబితా..  రూ.2 కోట్ల కేటగిరిలో ఐదురుగు భారత ఆటగాళ్లు..
IPL 2022 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022కి ముందు మెగా వేలానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 10 ఫ్రాంఛైజీలు 590 మంది ఆటగాళ్ల (370 భారతీయులు, 220 ఓవర్సీస్) జాబితా నుంచి ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ 590 మంది క్రికెటర్లలో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్ నేషన్స్‌కు చెందినవారు ఉన్నారు. IPL 2022 వేలంలో అత్యధిక బిడ్లను ఆకర్షించగల భారతీయ, విదేశీ ఆటగాళ్లను ఓసారి చూద్దాం..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 03, 2022 | 7:09 PM

బీసీసీఐ(bcci) 590 మంది ఆటగాళ్లతో వేలం కోసం తుది జాబితాను ప్రకటించింది. రాబోయే IPL 2022 మెగా వేలం(IPL 2022 Mega Auction) కోసం. తాజాగా ఆ జాబితాలో జోఫ్రా ఆర్చర్(archar) కూడా చేరాడు. ఆటగాళ్లలో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, 7 మంది అసోసియేట్ నేషన్స్‌కు చెందినవారు ఉన్నారు. అలాగే, 590 మంది ఆటగాళ్లలో 370 మంది భారతీయులు కాగా, మిగిలిన 220 మంది విదేశీ ఆటగాళ్లు.

వేలంలో నమోదు చేసుకున్న 1214 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ గతంలో ప్రకటించింది. తుది జాబితా ఇప్పుడు 590కి తగ్గింది. వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. ఐపీఎల్ సీజన్ మార్చిలో ప్రారంభమై మే చివరి వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ సీజన్ నుంచి మొత్తం 10 జట్లతో 74 మ్యాచ్‌లు ఆడనున్నాయి.

రాబోయే వేలంలో అనేక మంది ప్రఖ్యాత భారతీయ ఆటగాళ్లు తమను తాము నమోదు చేసుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్ నుంచి శిఖర్ ధావన్ వరకు, మహమ్మద్ షమీ నుండి శ్రేయాస్ అయ్యర్ వరకు, 2 కోట్ల కేటగిరీలో తమను తాము నమోదు చేసుకున్న అనేక మంది భారతీయ స్టార్లు ఉన్నారు. అయితే రాబోయే వేలంలో 2 కోట్ల కేటగిరీలో ఐదుగురు భారతీయ ఆటగాళ్లు ఉన్నారు.

మాజీ CSK క్రికెటర్ రైనా 2 కోట్ల కేటగిరిలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ విడుదల చేసిన కృనాల్ పాండ్యా కూడా ఈ కేటగిరిలో ఉన్నాడు. ఉతప్పకు ప్రస్తుతం 36 ఏళ్లు, అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఫ్రాంచైజీలు అతనిని IPL 2022 వేలంలో పక్కన పెట్టవచ్చు. అందుకే అతని 2 కోట్ల కేటగిరిలో ఉన్నాడు.

IPL 2022 మెగా వేలానికి ముందు కార్తీక్‌ను KKR విడుదల చేసింది. అతను 2018 నుండి 2020 వరకు ఫ్రాంచైజీకి నాయకత్వం వహించాడు. IPL 2020లో సగం వరకు కెప్టెన్సీ చేసిన తర్వాత అతడిని తొలగించారు. KKR Eoin మోర్గాన్ నేతృత్వంలో IPL 2021 ఫైనల్స్‌కు చేరుకుంది. ఇతను కూడా 2 కోట్ల కేటగిరిలో ఉన్నాడు. తెలుగు ఆటగాడు అంబటి రాయుడు ఈ కేటగిరిలో ఉన్నాడు.

Read also.. MS Dhoni: యోధుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఎంఎస్ ధోనీ.. హల్‌చల్ చేస్తున్న వీడియో..