AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాండ్యా విశ్వరూపం..ఏదీ ఫలితం?

కోల్‌కతా:ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. హార్దిక్‌పాండ్య (91; 34 బంతుల్లో 6×4, 9×6) విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడినా అతడికి సహకరించే బ్యాట్స్‌మెన్‌ కరవయ్యారు. దీంతో ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 198 పరుగులే చేసింది. కాగా  మొదట 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుని హార్దిక్‌ పాండ్య, పొలార్డ్‌(20) ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 63 పరుగులు […]

పాండ్యా విశ్వరూపం..ఏదీ ఫలితం?
Ram Naramaneni
|

Updated on: Apr 29, 2019 | 12:06 PM

Share

కోల్‌కతా:ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. హార్దిక్‌పాండ్య (91; 34 బంతుల్లో 6×4, 9×6) విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడినా అతడికి సహకరించే బ్యాట్స్‌మెన్‌ కరవయ్యారు. దీంతో ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 198 పరుగులే చేసింది. కాగా  మొదట 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుని హార్దిక్‌ పాండ్య, పొలార్డ్‌(20) ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 63 పరుగులు జోడించాక పొలార్డ్‌ ఔటయ్యాడు. అనంతరం కృనాల్‌ పాండ్య(24; 18బంతుల్లో 2×6)తో కలిసి హార్దిక్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్‌బోర్డుని పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 64 పరుగులు జోడించాక హార్దిక్‌ 91 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి రసెల్‌ చేతికి చిక్కాడు. అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగా ఉండడంతో ముంబయి ఓటమి ఖరారైంది. కాగా కోల్‌కతా బౌలర్లలో సునీల్‌నరైన్‌, హారీగుర్నే, రసెల్‌ రెండేసీ వికెట్లు తీయగా పీయుశ్‌ చావ్లా ఒక వికెట్‌ తీశాడు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 232 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. కాగా ఈ సీజన్‌లో ఇదే అత్యుత్తమ స్కోర్‌ కావడం విశేషం. ఓపెనర్లు శుభ్‌మన్‌గిల్‌(76; 45 బంతుల్లో 6×4, 4×6), క్రిస్‌లిన్‌(54; 29 బంతుల్లో 8×4, 2×6) ధాటిగా ఆడి శుభారంభాన్ని ఇచ్చారు. క్రిస్‌లిన్‌ అర్ధశతకం సాధించాక జట్టు స్కోర్‌ 96 పరుగుల వద్ద రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌ లెవిస్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై వన్‌డౌన్‌లో వచ్చిన ఆండ్రీ రసెల్‌(80; 40బంతుల్లో 6×4, 8×6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గిల్‌తో కలిసి స్కోర్‌ బోర్డుని పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో గిల్‌ అర్ధశతకం తర్వాత దూకుడుగా ఆడుతూ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో లెవిస్కే క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 62 పరుగులు జోడించారు. ఆఖర్లో రసెల్‌ అర్ధశతకం తర్వాత మరింత రెచ్చిపోయి ఆడాడు. అతడికి దినేశ్‌ కార్తిక్‌(15; 7 బంతుల్లో 1×4, 1×6) సహకరించడంతో ముంబయి ముందు భారీ టార్గెట్‌ నిర్దేశించారు. కాగా ముంబయి బౌలర్లలో హార్దిక్‌ పాండ్య, రాహుల్‌ చాహర్‌ చెరో వికెట్‌ తీశారు.