Mohammed Siraj: మనసున్న మా’సి’రాజు.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ప్రైజ్ మనీ ఎవరికిచ్చాడో తెలుసా?
Asia Cup 2023 Final, IND vs SL: మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనకుగాను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డుతో ప్రైజ్ మనీ USD 5,000 (భారత కరెన్సీలో సుమారు రూ. 4.16 లక్షలు)లు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ రికార్డు స్పెల్ (6/21)తో లంక టీంను ఊచకోత కోశాడు.

Mohammed Siraj Dedicated the Prize Money to R.Premadasa Stadium, Colombo Ground Staff: ఆసియా కప్ ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ప్రైజ్ మనీని గ్రౌండ్ స్టాఫ్‌కు అంకితం చేశాడు. దీంతో అటు ఆటతోనే కాదు.. విశ్రాంతి లేకుండా కష్టపడిన వారిని గౌరవించి, సహాయం చేసేందుకు ముందుంటానంటూ ఆదర్శంగా నిలిచాడు. దీంతో సోషల్ మీడియాలో సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. నువ్వు సూపర్ సిరాజ్ భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ “గ్రౌండ్ సిబ్బంది విరామం లేకుండా పనిచేశారు. ముద్దగా తడిచిన మైదానాన్ని మ్యాచ్ కోసం సిద్ధంచేయడంలో వాళ్ల శ్రమ ఎంతో విలువైనది. వారే ఈ క్రెడిట్‌కి అర్హులని నేను భావిస్తున్నాను. వారు లేకుండా టోర్నమెంట్ ముందుకు సాగేది కాదు”అంటూ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలో మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనకుగాను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డుతో వచ్చిన ప్రైజ్ మనీ USD 5,000 (భారత కరెన్సీలో సుమారు రూ. 4.16 లక్షలు)లను గ్రౌండ్ స్టాప్‌కు అందిస్తున్నట్లు ప్రకటించాడు.
ఈ క్రమంలో ACC, SLC కూడా క్యాండీ, కొలంబోలోని గ్రౌండ్ స్టాఫ్‌కు USD 50,000(సుమారు రూ.42లక్షలు) బహుమతిని ప్రకటించాయి.
ఫైనల్‌లో సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ రికార్డు స్పెల్ (6/21)తో లంక టీంను ఊచకోత కోశాడు. ఇందులో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి, కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకుంటున్న మహ్మద్ సిరాజ్..
Mohammad Siraj dedicated his Player Of The Match award and cash prize to all the ground staff.🫡#AsiaCupFinal #AsianCup2023 #siraj #INDvSL #Mohammadsiraj pic.twitter.com/hUixXCE5Vr
— RAJESH CHAUDHARY (@RAJESHC66643392) September 17, 2023
ఇరుజట్ల ప్లేయింగ్ 11:
View this post on Instagram
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








