IND VS ENG: 90 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఏకైక కీపర్‌గా పంత్ రికార్డ్.. ధోనికీ సాధ్యం కాలే..
ఎడ్జ్‌బాస్టన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రిషబ్ పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ కేవలం 76 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య జరుగుతోన్న 5వ టెస్ట్‌లో రిషబ్ పంత్ సత్తా చాటుతున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తర్వాత, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత అర్ధ సెంచరీని సాధించాడు. దీంతో భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని ఓ రికార్డు నెలకొల్పాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ కొట్టిన వెంటనే, విదేశీ గడ్డపై సెంచరీ తర్వాత హాఫ్ సెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ధోనీ నుంచి ఫరూఖ్ ఇంజనీర్ వరకు ఎవరూ ఈ ఘనత సాధించలేకపోవడం విశేషం. అదే సమయంలో పంత్ ఆ ఘనత సాధించి, తన ఆధిపత్యాన్ని మరోసారి చూపించాడు.
- భారత్‌లో కేవలం ఇద్దరు వికెట్‌కీపర్లు మాత్రమే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించారు. 1973లో ఇంగ్లండ్‌తో జరిగిన ముంబై టెస్టులో ఫరూక్ ఇంజనీర్ 121, 66 పరుగులు చేశాడు. విదేశీ గడ్డపై ఈ ఘనత సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు.
- ఎడ్జ్‌బాస్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 76 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా.. పంత్ మాత్రం 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఎడ్జ్‌బాస్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 57 పరుగులు చేసి ఔటయ్యాడు.
- రెండో ఇన్నింగ్స్‌లో రివర్స్ స్వీప్ ఆడుతూ పంత్ వికెట్ కోల్పోయాడు. అతను జాక్ లీచ్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ చేశాడు. బంతి అతని గ్లవ్స్‌కు తగిలి స్లిప్స్‌లో నిలబడిన జో రూట్ చేతిలో పడింది.
ఇవి కూడా చదవండి