India vs England, Day 4: హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన పంత్, పుజారా.. భారీ ఆధిక్యం దిశగా భారత్..
తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేసిన రిషబ్ పంత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు. 78 బంతుల్లో తన అర్థసెంచరీ పూర్తి చేశాడు. పంత్ టెస్టు కెరీర్‌లో ఇది 10వ అర్ధశతకం.
India vs England, Day 4: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు నాలుగో రోజు ఆట మొదలైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 284 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. 300 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు సాధించింది. దీంతో మొత్తం ఆధిక్యం 332 పరుగులకు చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేసిన రిషబ్ పంత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు. 78 బంతుల్లో తన అర్థసెంచరీ పూర్తి చేశాడు. పంత్ టెస్టు కెరీర్‌లో ఇది 10వ అర్ధశతకం. అర్థ సెంచరీ పూర్తి చేసిన అనంతరం, పంత్ పెవిలియన్ చేరాడు. అదే సమయంలో శ్రేయాస్ అయ్యర్(19) మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మాథ్యూ పాట్స్ షాట్ బాల్‌ను పుల్ చేయాలనుకుని బోల్తా పడ్డాడు.
పుజారా అద్భుత ఇన్నింగ్స్..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పుజారా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 168 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. అతని బ్యాట్ నుంచి 8 ఫోర్లు వచ్చాయి. అనంతరం పుజారాను స్టువర్ట్ బ్రాడ్ పెవిలియన్ పంపాడు. బ్రాడ్ వేసిన స్లామ్డ్ బాల్‌ను పాయింట్ దిశగా ఆడాలని ఛెతేశ్వర్ అనుకున్నాడు. అయితే అక్కడే నిల్చున్న అలెక్స్ లీస్ సింపుల్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు.
250+ లక్ష్యాన్ని బర్మింగ్‌హామ్‌లో ఒక్కసారి మాత్రమే ఛేదించారు..
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో 250+ లక్ష్యాన్ని ఒక్కసారి మాత్రమే ఛేదించారు. దక్షిణాఫ్రికా జట్టు 14 ఏళ్ల క్రితం 2008లో ఈ ఘనత సాధించింది. నాలుగో ఇన్నింగ్స్‌లో 283 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రా సేనకు ఈ టెస్టు మ్యాచ్, సిరీస్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చివరిసారిగా 2007లో బ్రిటీష్ వారి గడ్డపై టెస్టు సిరీస్‌లో టీమ్ ఇండియా విజయం సాధించింది. ప్రస్తుతం టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆ సమయంలో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.