Video: ఎమ్మెల్సీగా టీమిండియా స్టార్ తిలక్ వర్మ ప్రాణస్నేహితుడు.. ఆస్తుల చిట్టా చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే..!
Tilak Varma Friend Vikram Kakade: క్రీడలు, రాజకీయం వేర్వేరు రంగాలు అయినప్పటికీ, చిన్ననాటి స్నేహబంధం ముందు ఇవేవీ అడ్డుకావని తిలక్ వర్మ, విక్రమ్ కాకడే నిరూపించారు. వందల కోట్ల ఆస్తి, రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ విక్రమ్ తన స్నేహితుడిని గుండెల్లో పెట్టుకోగా, స్టార్ క్రికెటర్ హోదాలో ఉండి కూడా తిలక్ తన స్నేహితుడి గెలుపును పండగలా మార్చుకోవడానికి తరలిరావడం నిజమైన స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. చట్టసభ సభ్యుడిగా విక్రమ్ కాకడే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆశిద్దాం.

Tilak Varma Friend Vikram Kakade: భారత యువ క్రికెట్ సంచలనం తిలక్ వర్మ మైదానంలోనే కాదు, స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడని మరోసారి నిరూపితమైంది. తన చిన్ననాటి ప్రాణస్నేహితుడు విక్రమ్ కాకడే మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా (ఎమ్మెల్సీ) ప్రమాణ స్వీకారం చేసే అరుదైన ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు ఈ స్టార్ క్రికెటర్ స్వయంగా ముంబైలోని అసెంబ్లీకి తరలివెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
స్నేహితుడి కోసం అసెంబ్లీ మెట్లెక్కిన తిలక్ వర్మ..
మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ, క్రీడా లోకంలోనూ ఇప్పుడు ఒకే ఒక్క వార్త మారుమోగిపోతోంది. టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ముంబైలోని విధాన భవన్‌లో సందడి చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) తరపున పుణె స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన తన బాల్య మిత్రుడు విక్రమ్ కాకడే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తిలక్ హాజరయ్యాడు. చట్టసభలో తన స్నేహితుడు అడుగుపెడుతుంటే, ప్రేక్షకుల స్థానంలో కూర్చొని ఆనందబాష్పాలతో చప్పట్లు కొట్టాడు. “మేమిద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులం, విక్రమ్ ఎప్పుడూ సమాజానికి సేవ చేయాలనే తపనతో ఉంటాడు. ఈరోజు తను ఈ స్థాయిలో ఉండటం నాకు ఎంతో గర్వంగా ఉందంటూ” తిలక్ వర్మ భావోద్వేగానికి లోనయ్యాడు.
విక్రమ్ కాకడే ఎవరు? రాజకీయ నేపథ్యం ఏంటి?
#WATCH | Mumbai, Maharashtra: On his visit to Vidhan Bhavan for the oath-taking ceremony of his friend, Vikram Kakade, cricketer Tilak Varma says, “We have been friends since childhood, so I am very happy about the announcement of his MLC role today. It feels great—I feel truly… pic.twitter.com/dILOrkk9Ze
— ANI (@ANI) June 23, 2026
చిన్న వయసులోనే రాజకీయాల్లోనూ, వ్యాపార రంగంలోనూ రాణించిన విక్రమ్ కాకడేకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన మహారాష్ట్ర మాజీ రాజ్యసభ ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కాకడే కుమారుడు. అంతేకాకుండా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు విక్రమ్ అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. ఎన్‌సీపీ అగ్రనాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యంతో ఈ యువనేత రాజకీయాల్లో అత్యంత వేగంగా ఎదిగారు. కేవలం 33 ఏళ్ల వయసులోనే ఎటువంటి వ్యతిరేకత లేకుండా ఏకగ్రీవంగా శాసనమండలికి ఎన్నికై తన రాజకీయ చతురతను చాటుకున్నారు.
రూ.150 కోట్ల సామ్రాజ్యం.. మైండ్ బ్లాక్ చేస్తున్న ఆస్తుల వివరాలు..
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విక్రమ్ కాకడే ప్రకటించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఆయనకు ఏకంగా 150 కోట్ల రూపాయలకు పైగా విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. నిర్మాణ రంగంలో (కన్‌స్ట్రక్షన్ బిజినెస్) రారాజుగా వెలుగొందుతున్న విక్రమ్‌కు లగ్జరీ కార్లంటే విపరీతమైన పిచ్చి. ఆయన గ్యారేజీలో లంబోర్గిని హురాకాన్, బీఎండబ్ల్యూ, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూజర్ వంటి దాదాపు 22 కోట్ల రూపాయల విలువైన ప్రపంచ స్థాయి విలాసవంతమైన కార్లు కొలువుదీరి ఉన్నాయి. వీటితో పాటు దుబాయ్‌లో రూ.7.5 కోట్ల విలువైన ఒక ప్యాలెస్ లాంటి లగ్జరీ అపార్ట్‌మెంట్ కూడా ఉంది.
ఉపముఖ్యమంత్రి కుమారుడికే కోట్లల్లో అప్పులు..!
విక్రమ్ కాకడే ఆర్థిక బలం ఎంతటిదో చెప్పడానికి ఆయన అఫిడవిట్‌లోని ఒక అంశం సాక్ష్యంగా నిలుస్తోంది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి కుటుంబానికి, ముఖ్యంగా అజిత్ పవార్ కుమారుడు జయ్ పవార్‌కే విక్రమ్ ఒక భూమి కొనుగోలు ఒప్పందంలో భాగంగా ఏకంగా 10 కోట్ల రూపాయల అడ్వాన్స్ (అప్పు) ఇచ్చినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చదువు పరంగా 12వ తరగతి (ఇంటర్మీడియట్) పూర్తి చేసినప్పటికీ, వ్యాపార వ్యూహాలతో వందల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించి, ఇప్పుడు ఏకంగా చట్టసభలో అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
