Virat Kohli: కోహ్లీని 3వ నంబర్‌ నుంచి తప్పించిన అసలు కారణం ఇదే.. తేల్చేసిన బ్యాటింగ్ కోచ్..

Virat kohli: 2024 టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా ఆడుతున్నాడు. అయితే, ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అతడి బ్యాట్ సైలెంట్‌గా ఉంది. ఐర్లాండ్‌, పాకిస్థాన్‌, అమెరికాలపై విరాట్‌ కోహ్లి కేవలం ఐదు పరుగులు మాత్రమే చేయగలడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడిని 3వ నంబర్‌ నుంచి తప్పించి ఓపెనర్‌గా ఎందుకు ఆడిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Virat Kohli: కోహ్లీని 3వ నంబర్‌ నుంచి తప్పించిన అసలు కారణం ఇదే.. తేల్చేసిన బ్యాటింగ్ కోచ్..
అందుకు తగ్గట్టుగానే ఈరోజు (జూన్ 29) బార్బడోస్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి భారత జట్టు విరాట్ కోహ్లి అతిపెద్ద కలను నెరవేరుస్తుందేమో వేచి చూడాలి.
Follow us
Venkata Chari

|

Updated on: Jun 16, 2024 | 1:20 PM

2024 టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా ఆడుతున్నాడు. అయితే, ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అతడి బ్యాట్ సైలెంట్‌గా ఉంది. ఐర్లాండ్‌, పాకిస్థాన్‌, అమెరికాలపై విరాట్‌ కోహ్లి కేవలం ఐదు పరుగులు మాత్రమే చేయగలడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడిని 3వ నంబర్‌ నుంచి తప్పించి ఓపెనర్‌గా ఎందుకు ఆడిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈక్రమంలో భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించాడు. కోహ్లీని ఓపెనర్‌గా ఆడించడం వెనుక ఉన్న ఆలోచనను వివరించాడు. రిషబ్ పంత్ మూడో నంబర్‌లో ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నాడో కూడా చెప్పుకొచ్చాడు.

భారత్, కెనడా మ్యాచ్ రద్దయిన తర్వాత స్టార్ స్పోర్ట్స్‌తో రాథోడ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ను ఓపెనింగ్ చేయడం ఉత్తమమని భావించాం. అతను ఐపీఎల్‌లో పరుగులు చేస్తున్నాడు. అక్కడ ఓపెనర్‌గా మాత్రమే ఆడాడు. ఫాస్ట్ బౌలర్లను అద్భుతంగా ఆడతాడు. అలాగే, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ను మూడో స్థానంలో ఉంచాలని మేం కోరుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో కోహ్లీని ఓపెనింగ్‌లో, పంత్‌ను 3వ స్థానంలో ఆడించాలని నిర్ణయించుకున్నాం.

కోహ్లి ఫామ్ గురించి బ్యాటింగ్ కోచ్ ఏమన్నాడంటే?

ఓపెనర్‌గా కోహ్లీ పరుగులు చేయలేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ, భారత జట్టు మేనేజ్‌మెంట్ పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాటింగ్ కోచ్ తెలిపాడు.

‘ఎప్పుడు వచ్చినా కోహ్లి గురించే చర్చ. అతను పరుగులు చేసినా చేయకపోయినా. చింతించాల్సిన పనిలేదు. కంగారుపడవద్దు. వచ్చే టోర్నీలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. రెండుసార్లు తక్కువ స్కోర్ చేయడం వల్ల ఏమీ మారదు. అతను బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను పరుగులు చేయడంపై దృష్టి సారించాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడి భారీ ఇన్నింగ్స్‌ కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..