AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs PAK: పాక్ మ్యాచ్‌కు ముందు టీమిండియాలో టెన్షన్.. ఆ 3 లోపాలు సరిదిద్దుకోకపోతే అస్సామే.!

టీ20 ప్రపంచకప్‌లో నమీబియాపై భారత్ గెలిచినా, పాక్‌తో మ్యాచ్‌ ముందు మూడు లోపాలు సరి చేసుకోవాల్సినవసరం ఉంది. స్పిన్‌కు తడబడటం, డెత్ ఓవర్లలో బ్యాటర్ల వైఫల్యం, పేసర్‌ అర్షదీప్ సింగ్ ఫామ్ లేమి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా..

IND Vs PAK: పాక్ మ్యాచ్‌కు ముందు టీమిండియాలో టెన్షన్.. ఆ 3 లోపాలు సరిదిద్దుకోకపోతే అస్సామే.!
Ind Vs Pak
Ravi Kiran
|

Updated on: Feb 14, 2026 | 5:19 PM

Share

టీ20 ప్రపంచకప్‌లో నమీబియాపై భారీ విజయం సాధించినప్పటికీ, ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్తాన్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌ ముందు టీమిండియాలో మూడు ప్రధాన లోపాలను అధిగమించాలి. మరి అవేంటో ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం.. మొదటిది, మిడిల్ ఓవర్లలో స్పిన్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తడబడటం. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ కేవలం 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు. స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలమవడం, ఒత్తిడిలో వికెట్లు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్‌కు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి ఇది పెద్ద బలహీనత కావచ్చు.

రెండోది, డెత్ ఓవర్లలో బ్యాటర్ల వైఫల్యం. 16 ఓవర్లకు 184 పరుగులు చేసిన భారత్, చివరి నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. రింకూ సింగ్, శివమ్ దూబే లాంటి ఫినిషర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. కీలక మ్యాచ్‌లలో ఈ చివరి పరుగులే గెలుపోటములను నిర్ణయిస్తాయి. మూడోది, పేస్ బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్ ఫామ్ లేమి. నమీబియాపై 3 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి వికెట్ తీయకపోవడం జట్టుకు నష్టం. మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ లాంటి పాక్ ఓపెనర్లను కట్టడి చేయాలంటే బూమ్రాపైనే కాకుండా అర్షదీప్ కూడా రాణించడం చాలా ముఖ్యం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో బ్యాటింగ్ ఆర్డర్, డెత్ ఓవర్ వ్యూహాలను మెరుగుపరుచుకోవడం అత్యవసరం.

నమీబియాపై గెలిచి సూపర్ ఎయిట్‌లో దాదాపు బెర్త్ ఖాయం చేసుకున్నప్పటికీ, పాకిస్తాన్‌తో జరిగే హై వోల్టేజ్ పోరులో ఈ పొరపాట్లు రిపీట్ అయితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు ఫ్యాన్స్. సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో బ్యాటింగ్ ఆర్డర్‌ను సెట్ చేయడంతో పాటు, డెత్ ఓవర్ల వ్యూహాలను మెరుగుపరుచుకోవాలి. కొలంబో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయి కాబట్టి, భారత బ్యాటర్లు దీనికి తగ్గట్లుగా మెంటల్‌గా సిద్దం కావాలంటున్నారు. ఫిబ్రవరి 15న జరిగే ఈ కీలక పోరులో టీమిండియా ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.

Follow Us
మెజార్టీ జస్ట్ మిస్.. ఇప్పుడు విజయ్ ముందున్న ఆప్షన్స్ ఏంటో తెలుసా
మెజార్టీ జస్ట్ మిస్.. ఇప్పుడు విజయ్ ముందున్న ఆప్షన్స్ ఏంటో తెలుసా
ఇవి కొండచిలువను కొరికి నమిలేస్తాయ్.. తాచుపాము కరిచినా ఏం కాదు..
ఇవి కొండచిలువను కొరికి నమిలేస్తాయ్.. తాచుపాము కరిచినా ఏం కాదు..
టీవీకే విజయ్‌ తండ్రికి, చిరంజీవికి ఉన్న సంబంధమేంటో తెలుసా?
టీవీకే విజయ్‌ తండ్రికి, చిరంజీవికి ఉన్న సంబంధమేంటో తెలుసా?
మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రోజే భారీగా దిగి వచ్చిన బంగారం ధర..
మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రోజే భారీగా దిగి వచ్చిన బంగారం ధర..
కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
మరో వారంలో TG ICET 2026 రాత పరీక్షలు.. హాల్‌టికెట్ల లింక్ ఇదిగో
మరో వారంలో TG ICET 2026 రాత పరీక్షలు.. హాల్‌టికెట్ల లింక్ ఇదిగో
ఇటు ధోనీకి ఇచ్చిపేడేసి.. అటు రోహిత్, కోహ్లీల సరసన చేరిన 'పాండే'
ఇటు ధోనీకి ఇచ్చిపేడేసి.. అటు రోహిత్, కోహ్లీల సరసన చేరిన 'పాండే'
హోమ్ లోన్‌తో ఇల్లు కొనాలనుకునేవారు ఇప్పుడే కళ్లు తెరవండి.!
హోమ్ లోన్‌తో ఇల్లు కొనాలనుకునేవారు ఇప్పుడే కళ్లు తెరవండి.!
రిలయన్స్ జోరు.. కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!
రిలయన్స్ జోరు.. కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!
శుక్రుడితో లక్ష్మీ యోగం! ఆ రాశుల వారికి సిరిసంపదలు ఖాయం..!
శుక్రుడితో లక్ష్మీ యోగం! ఆ రాశుల వారికి సిరిసంపదలు ఖాయం..!