AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి డోర్స్‌పై జిడ్డు మరకలా.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో నిమిషాల్లో కొత్తవాటిలా మెరిసిపోతాయ్..

ఇల్లు ఎంత నీట్‌గా ఉన్నా.. తలుపులపై నల్లటి జిడ్డు మరకలు ఉంటే ఇంటి అందమే పాడైపోతుంది. మురికి చేతులతో పదేపదే తాకడం, జిడ్డు వల్ల తలుపుల హ్యాండిల్స్ చుట్టూ ఒక మొండి నల్లటి పొర పేరుకుపోతుంది. అయితే ఇంట్లోనే ఉండే వస్తువులతో వాటిని సరికొత్తగా ఎలా మెరిపించవచ్చో కొన్ని అద్భుతమైన చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటి డోర్స్‌పై జిడ్డు మరకలా.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో నిమిషాల్లో కొత్తవాటిలా మెరిసిపోతాయ్..
How To Clean Dirty Doors
Krishna S
|

Updated on: Jun 28, 2026 | 10:47 AM

Share

ఇల్లు క్లీనింగ్ అనేది మహిళలకు అతిపెద్ద టాస్క్. అయితే ఇల్లు శుభ్రం చేసేటప్పుడు చాలామంది కిటికీలు, నేల, ఫర్నిచర్‌పై చూపించే శ్రద్ధను తలుపులపై చూపించరు. కానీ రోజూ మురికి చేతులతో పదేపదే తాకడం, వంటగది నుండి వచ్చే నూనెలు, మసాలాల జిడ్డు, బయటి దుమ్ము వల్ల తలుపులపై.. ముఖ్యంగా హ్యాండిల్స్ చుట్టూ నల్లటి, మొండి పొర పేరుకుపోతుంది. దీనివల్ల తలుపులు చూడటానికి అసహ్యంగా కనిపిస్తాయి. అయితే వీటిని మామూలు నీటితో లేదా ఘాటైన డిటర్జెంట్లతో రుద్దడం వల్ల చెక్క పెయింట్ లేదా పాలిష్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఖరీదైన క్లీనర్లు లేకుండా, గంటల తరబడి శ్రమపడకుండా ఇంట్లోనే ఉండే వస్తువులతో చెక్క, ప్లైవుడ్ లేదా ఇనుప తలుపులను సరికొత్తగా ఎలా మెరిపించవచ్చో తెలుసుకోవడం ముఖ్యం.

వెనిగర్ – ఆలివ్ నూనె

ఒకవేళ మీ ఇంట్లోని చెక్క తలుపులు జిడ్డుగా మారి మెరుపు కోల్పోతే ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో అర కప్పు తెల్ల వెనిగర్, అర కప్పు ఆలివ్ నూనె కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో పోయండి. వెనిగర్ తలుపుపై ఉన్న నల్లటి మురికిని, జిగురును రుద్దాల్సిన అవసరం లేకుండానే వదులు చేస్తుంది. అదే సమయంలో ఇందులోని నూనె చెక్కకు మంచి పోషణనిచ్చి, సరికొత్త మెరుపును తెస్తుంది. దీన్ని తలుపుపై స్ప్రే చేసి, ఒక శుభ్రమైన కాటన్ గుడ్డతో తుడిస్తే సరిపోతుంది.

బేకింగ్ సోడా, లిక్విడ్ డిష్ సోప్

తలుపుల మూలల్లో, హ్యాండిల్స్ చుట్టూ, డిజైన్లు ఉన్నచోట పేరుకుపోయే నల్లటి మురికిని వదిలించడానికి ఇది బెస్ట్ రెమెడీ. కొద్దిగా బేకింగ్ సోడా, లిక్విడ్ డిష్ సబ్బు కలిపి పేస్ట్‌లా తయారుచేయండి. ఈ పేస్ట్‌ను మురికి ఎక్కువగా ఉన్న భాగాల్లో రాయండి. ఈ పేస్ట్‌ను రాసి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత ఒక పాత, మెత్తటి టూత్‌బ్రష్‌తో మెల్లగా రుద్దితే నల్లటి మురికి అంతా కరిగిపోయి ఊడిపోతుంది. చివరిగా ఒక తడి గుడ్డతో తుడిచేసుకుంటే తలుపు క్లీన్ అవుతుంది.

నిమ్మకాయ – ఉప్పు

ఇంటి ప్రధాన ద్వారాలు లేదా గ్రిల్స్ ఇనుముతో చేసినవైతే, వాటికి త్వరగా తుప్పు పట్టడం లేదా నల్లటి మరకలు పడటం జరుగుతుంది. ఒక నిమ్మకాయను సగానికి కోసి, దానిపై కొద్దిగా ఉప్పు చల్లాలి. ఈ నిమ్మ చెక్కతో మరకలు లేదా తుప్పు పట్టిన చోట మెల్లగా రుద్దాలి. నిమ్మకాయలోని యాసిడ్ గుణాలు, ఉప్పులోని బరుసదనం కలిసి ఎక్కువ శ్రమ లేకుండానే ఇనుప తలుపులపై ఉన్న తుప్పును, నల్లటి మొండి మరకలను పూర్తిగా తొలగిస్తాయి.

పండగలు, శుభకార్యాలు వచ్చేటప్పుడు మార్కెట్లో దొరికే కెమికల్ క్లీనర్ల కోసం డబ్బులు వృథా చేయకుండా.. ఈ సింపుల్ స్మార్ట్ కిచెన్ హ్యాక్స్‌ని ప్రయత్నిస్తే మీ ఇంటి తలుపులు ఎప్పుడూ సరికొత్తగా మెరుస్తూనే ఉంటాయి.

Follow Us
మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు
మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు
నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి
నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి
సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..
సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు