AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: అయ్యో.. బుజ్జమ్మ.. అప్పడే నూరేళ్లు నిండిపోయాయా..?

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న 18 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు నీటితో నింపిన టబ్‌లో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు గమనించేలోపే ఈ ఘటన జరగడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Andhra: అయ్యో.. బుజ్జమ్మ.. అప్పడే నూరేళ్లు నిండిపోయాయా..?
Manasa
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Jun 28, 2026 | 10:42 AM

Share

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న 18 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు నీటితో నింపిన టబ్‌లో పడి మృతి చెందింది. ఈ ఘటనతో చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొనగా, స్థానికులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతురాలిని సుబరి మానస (18 నెలలు)గా గుర్తించారు. ఆమె తల్లిదండ్రులు సుబరి బంధు సురభి, రాజకుమారి సుబరి. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉండగా, మానస చిన్న కుమార్తె. పెద్ద కుమార్తె మిల్లి సుబరి (5 సంవత్సరాలు), రెండో కుమార్తె సుమిత్ర (4 సంవత్సరాలు).

కుటుంబం జీవనోపాధి కోసం ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా గునుపూర్ సమీపంలోని చిన్నఆసరి గ్రామం నుంచి బొబ్బిలి మండలం కారాడ గ్రామానికి వలస వచ్చింది. అక్కడ స్థానిక రైతు తోటకూర వీరభద్రరావుకు చెందిన పామాయిల్ తోటలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. శనివారం రాత్రి ఇంట్లో విద్యుత్ ఫ్యాన్ పనిచేయకపోవడంతో తల్లిదండ్రులు దానిని మరమ్మతు చేయడంలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఇంటి వద్ద నీటితో నింపి ఉంచిన టబ్ సమీపంలో చిన్నారి మానస ఒంటరిగా ఆడుకుంటోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు టబ్‌లో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అనంతరం నీటి టబ్‌లో అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, మానస ప్రతిరోజూ తన ఇద్దరు అక్కలతో కలిసి టబ్‌లోని నీటితో ఆడుకునేది. సాధారణంగా అక్కలు చెల్లిని జాగ్రత్తగా గమనించేవారు. అయితే ఘటన జరిగిన రాత్రి ఇద్దరు అక్కలు ముందుగానే నిద్రపోగా, తల్లిదండ్రులు ఫ్యాన్ రిపేర్‌లో నిమగ్నమవడంతో చిన్నారిని గమనించలేకపోయారు. అదే విషాదానికి కారణమైంది. ఈ ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికంగా ఈ విషాదం అందరినీ కలచివేసింది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు, సంరక్షకులు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాల్లో నీటితో నింపిన టబ్బులు, బకెట్లు వంటి వాటి వద్ద చిన్నారులను ఒంటరిగా వదిలేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Follow Us
అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..?
అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..?
మహేష్ బాబు 'వారణాసి' సినిమా స్టోరీని లీక్ చేసిన రాజమౌళి
మహేష్ బాబు 'వారణాసి' సినిమా స్టోరీని లీక్ చేసిన రాజమౌళి
ఐస్ బాత్‌లు, నో ఫోన్ రూల్స్.. టీమిండియా కుర్రాళ్ల ‘సండే సీక్రెట్’
ఐస్ బాత్‌లు, నో ఫోన్ రూల్స్.. టీమిండియా కుర్రాళ్ల ‘సండే సీక్రెట్’
ఉదయం ఈ 3 శబ్దాలు విన్నారా? వాస్తు ప్రకారం మీ రోజు మారిపోతుంది..
ఉదయం ఈ 3 శబ్దాలు విన్నారా? వాస్తు ప్రకారం మీ రోజు మారిపోతుంది..
త్రిషతో కలిసి ఆ స్టార్ హీరో భార్య సందడి..ఎవరో గుర్తుపట్టారా.. ?
త్రిషతో కలిసి ఆ స్టార్ హీరో భార్య సందడి..ఎవరో గుర్తుపట్టారా.. ?
అప్పట్లో ఫుల్ డిమాండ్.. పల్లెటూరి కార్తీక మాస పచ్చడి..
అప్పట్లో ఫుల్ డిమాండ్.. పల్లెటూరి కార్తీక మాస పచ్చడి..
కుక్క కరిచిన వెంటనే ఈ పనులు చేయండి..
కుక్క కరిచిన వెంటనే ఈ పనులు చేయండి..
ఉద్యోగం చేసేవాళ్లే కాదు.. ఈ 9 మంది కూడా పన్ను చెల్లించాల్సిందే
ఉద్యోగం చేసేవాళ్లే కాదు.. ఈ 9 మంది కూడా పన్ను చెల్లించాల్సిందే
వాషింగ్ మెషిన్ నుండి దుర్వాసన వస్తోందా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్
వాషింగ్ మెషిన్ నుండి దుర్వాసన వస్తోందా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్
పూణే హత్య: కేతన్ అగర్వాల్ కేసులో సియా గోయల్ షాకింగ్ వాంగ్మూలం
పూణే హత్య: కేతన్ అగర్వాల్ కేసులో సియా గోయల్ షాకింగ్ వాంగ్మూలం