India vs Sri Lanka: శ్రీలంక సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం.. ఎందుకో తెలుసా?
లంకతో జరిగే టీ20, టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియాలో పెను మార్పులు కనిపిస్తున్నాయి. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, టీ20 సిరీస్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది.
India vs Sri Lanka: శ్రీలంకతో జరిగే టీ20, టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా(Team India)లో పెను మార్పులు కనిపిస్తున్నాయి. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, టీ20 సిరీస్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. కోహ్లి చాలా కాలంగా నిరంతరంగా క్రికెట్ ఆడుతున్నాడు. మరోవైపు రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జాతీయ జట్టులోకి రావచ్చని తెలుస్తోంది. జడేజా గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ నుంచి టీమిండియాలో భాగం కాలేదు. అదే సమయంలో, సౌతాఫ్రికా టూర్ తర్వాత వెస్టిండీస్ సిరీస్‌లో బుమ్రాకు విశ్రాంతి లభించింది. టెస్టు సిరీస్‌కు ముందు, బీసీసీఐ రోహిత్ శర్మను మూడు ఫార్మాట్‌ల కెప్టెన్‌గా కూడా చేయవచ్చే వార్తలు వినిపిస్తున్నాయి.
జడేజా ప్రస్తుతం NCAలో ఉన్నాడు.. జడేజా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో పునరావాసం పొందుతున్నాడు. అతను ఫిబ్రవరి 24 నాటికి లక్నో చేరుకోవచ్చు. అక్కడ అతను కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండవలసి ఉంటుంది. జడేజా టీ20 సిరీస్‌లో కాకుండా టెస్టు సిరీస్‌లో ఆడాలని భావిస్తున్నాడు. అయితే టీ20 సిరీస్ నుంచి మాత్రమే బుమ్రా తిరిగి వచ్చే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 24 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం.. టీమిండియా-శ్రీలంక మధ్య టీ20, టెస్టు సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 24 నుంచి లక్నోలో జరిగే తొలి టీ20 మ్యాచ్‌తో శ్రీలంక జట్టు పర్యటన ప్రారంభం కానుంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మార్చి 4 నుంచి మొహాలీలో ప్రారంభం కానుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 100వ టెస్టు మ్యాచ్‌ని మొహాలీలోనే ఆడనున్నాడు.
టెస్టు జట్టుకు కెప్టెన్‌గా రోహిత్.. సెలెక్టర్లు, ఆటగాళ్లు, కోచ్‌లు అందరూ రోహిత్ శర్మ టెస్టు జట్టుకు కూడా కెప్టెన్‌గా ఉండాలని కోరుకుంటున్నారని బీసీసీఐ అధికారి తన ప్రకటనలో తెలిపారు. వచ్చేవారం శ్రీలంకతో జరిగే సిరీస్‌కు జట్టు ఎంపిక తర్వాత టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌ని నియమిస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపాడు. ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్లలో హిట్‌మన్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: IND vs WI: రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయం.. 2-0 తేడాతో సిరీస్ కైవసం..