IND vs SL Weather Update: టాస్ తర్వాత మొదలైన వర్షం.. ఆలస్యంగా మ్యాచ్?
India vs Sri Lanka Colombo weather report, Asia Cup final 2023: కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగే ఆసియా కప్ ఫైనల్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో భారత్ తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే టాస్ పడింది. టాస్ పడిన కొద్దిసేపటికే వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ కొద్దిగా ఆలస్యం కానుంది.

టాస్ గెలిచిన శ్రీలంక..
ఆసియా కప్ 2023లో ఫైనల్ మ్యాచ్‌లో టాస్ పడిన తర్వాత వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ ప్రారంభానికి కొద్దిగా ఆలస్యం కానుంది. ప్రస్తుతానికి వర్షం తగ్గింది. కానీ, ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో కవర్లను అలాగే ఉంచారు. లంక జట్టు సారథి ధనుష్ శనక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లూ తలో మార్పుతో ఫైనల్ పోటీలోకి దిగాయి. గాయపడిన మహిష్ తీక్షణ స్థానంలో దుషాన్ హేమంత్‌తో ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. అలాగే గాయం కారణంగా దూరమైన అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ భారత జట్టులో చేరాడు.
Start of play has been delayed due to 🌧️
Stay Tuned for more updates!
Follow the match ▶️ https://t.co/xrKl5d85dN#TeamIndia | #AsiaCup2023 | #INDvSL pic.twitter.com/cq3ZyZnipu
— BCCI (@BCCI) September 17, 2023
ఇరుజట్ల ప్లేయింగ్ 11:
View this post on Instagram
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ.
ఆసియాకప్ ఫైనల్‌కు చేరిన టీమిండియా జర్నీ..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..