Ind vs Pak Probable Playing XI: 8 ఏళ్లుగా ఆసియా కప్‌లో పాక్‌పై ఓటమెరగని భారత్.. ఇరుజట్ల ప్లేయింగ్ XI ఇలా ఉండే ఛాన్స్..
భారత్ 7 సార్లు ఆసియా కప్ విజేతగా నిలవగా, 3 సార్లు రన్నరప్‌గా నిలిచింది. పాకిస్థాన్ రెండు సార్లు టైటిల్ గెలుచుకుంది. రెండు జట్లు 2008 నుంచి ఎనిమిది సార్లు తలపడ్డాయి. ప్రతిసారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టు విజేతగా నిలిచింది.
India vs Pakistan, 2nd Match, Group A: 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు నేడు తలపడనున్నాయి. ఆసియా కప్ గ్రూప్ Aలో భాగంగా జరిగే ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకుముందు, రెండు జట్లు T20 ప్రపంచ కప్‌లో 24 అక్టోబర్ 2021న ఒకే మైదానంలో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంటే ఈ మ్యాచ్ భారత్‌కు ఎంతో కీలకం కానుంది.
ఆసియా కప్ గురించి మాట్లాడితే, 2014 నుంచి పాకిస్తాన్ జట్టు భారత్‌పై ఏ మ్యాచ్‌ను గెలవలేదు. 2018 ఆసియా కప్‌లో రెండుసార్లు, 2016 టోర్నమెంట్‌లో ఒకసారి భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. మొత్తంమీద ఆసియా కప్‌లో రికార్డు గురించి మాట్లాడితే, పాకిస్థాన్‌తో జరిగిన 14 మ్యాచ్‌లలో భారత్ 8 మ్యాచ్‌లు గెలిచింది. అదే సమయంలో పాక్ జట్టు 5 మ్యాచ్‌లు గెలిచింది. వర్షం కారణంగా ఒక్క మ్యాచ్ ఆడలేదు.
వాతావరణం, భారీ స్కోరు అంచనా..
ఈ మ్యాచ్‌లో దుబాయ్‌లో వర్షం కురిసే అవకాశం లేదు. వాతావరణం స్పష్టంగా ఉంటుంది. ఈ సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అదే సమయంలో, పిచ్ గురించి చెప్పాలంటే, అది బ్యాట్స్‌మెన్‌కు సహాయకరంగా ఉంటుంది. కాబట్టి అభిమానులు అధిక స్కోరింగ్ మ్యాచ్‌ని చూడగలరు. అయితే, స్వింగ్, సీమ్ బౌలర్లు మ్యాచ్ మొదటి రెండు-మూడు ఓవర్లలో సహాయం పొందవచ్చు. భారత్, పాకిస్థాన్ జట్లకు చాలా మంది పవర్ హిట్టర్లు ఉన్నారు. కాబట్టి భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.
ప్రత్యక్ష ప్రసారం..
స్టార్ స్పోర్ట్స్ వివిధ ఛానెల్‌లతో పాటు DD స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్‌ను చూడొచ్చు. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లోనూ ఈ మ్యాచ్ చూడొచ్చు.
ఆసియా కప్‌లో టాస్ గెలిచి బౌలింగ్ చేసే విధానాన్ని ఇరు జట్లు అనుసరించవచ్చు. లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 7, పాకిస్థాన్ 3 సార్లు విజయం సాధించాయి. ఇండో-పాక్ మ్యాచ్‌తో పాటు ఆసియా కప్‌లో టీమిండియా అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.
భారత్ 7 సార్లు ఆసియా కప్ విజేతగా నిలవగా, 3 సార్లు రన్నరప్‌గా నిలిచింది. పాకిస్థాన్ రెండు సార్లు టైటిల్ గెలుచుకుంది. రెండు జట్లు 2008 నుంచి ఎనిమిది సార్లు తలపడ్డాయి, ప్రతిసారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టు విజేతగా నిలిచింది. ఇందులో భారత్ 6 విజయాలు సాధించగా, లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ 2 గెలిచింది. కాబట్టి ఈరోజు టాస్ చాలా కీలకంగా మారనుంది.
2016, 2018 లో..
రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్ 2016 ఆసియా కప్‌లో రెండుసార్లు, 2018లో రెండుసార్లు పాకిస్థాన్‌ను ఓడించింది.
ఇరుజట్ల బలాలు..
సూర్యకుమార్ యాదవ్ 12 ఇన్నింగ్స్‌లలో 189.38 స్ట్రైక్ రేట్‌తో 428 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో, స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ 16 మ్యాచ్‌లలో 6.38 ఎకానమీతో 20 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది టీ20 ఫార్మాట్‌లో పాకిస్థాన్‌కు మహ్మద్ రిజ్వాన్ బ్యాట్ భీకరంగా మాట్లాడింది. రిజ్వాన్ 27 మ్యాచుల్లో 1349 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 134.63గా ఉంది. రిజ్వాన్ బ్యాటింగ్‌లో 12 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ సాధించాడు. అతని భాగస్వామి, పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ బ్యాట్ కూడా సత్తా చాటాడు. బాబర్ 27 మ్యాచ్‌ల్లో 1005 పరుగులు చేశాడు. పాక్ బౌలింగ్ గురించి మాట్లాడితే, హరీస్ రవూఫ్ 22 మ్యాచ్‌లలో 26 వికెట్లు తీయగా, షాదాబ్ ఖాన్ అదే సంఖ్యలో 20 వికెట్లు తీశాడు.
మీకు తెలుసా..
– పాకిస్థాన్ జట్టుకు యూఏఈలో మంచి ట్రాక్ ఉంది. ఇక్కడ ఆడిన 17 టీ20లో ఒక్కటి మాత్రమే ఓడిపోయింది. 2021 T20 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఆ టీం ఓటమిపాలైంది.
– విరాట్ కోహ్లి ఫామ్ కోసం చాలా కష్టపడుతున్నాడు. అయితే, పాకిస్తాన్ టీంపై T20I టోర్నమెంట్‌లలో వరుసగా 78*, 36*, 49, 55*, 57 స్కోర్‌లతో చక్కటి రికార్డును కలిగి ఉన్నాడు.
రెండు జట్ల ప్లేయింగ్ XI ఇలా ఉండొచ్చు..
ఇండియా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్
పాకిస్థాన్: మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, మహ్మద్ హస్నైన్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాదిర్, హరీస్ రవూఫ్, నసీమ్ షా/షానవాజ్ దహానీ