IND vs PAK: షాకింగ్ న్యూస్.. ‘ఆసియా కప్‌లో భారత్, పాక్ మ్యాచ్ జరగదు..’
Asia Cup 2025: భారత్ ఒమన్, యూఏఈ, పాకిస్తాన్‌లతో పాటు గ్రూప్ ఏలో ఉంది. గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంక ఉన్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడుతుంది.

India vs Pakistan: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉండదని భారత మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. అదే సమయంలో, ఈ మ్యాచ్ జరగదని జాదవ్ షాకిచ్చాడు. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్ రౌండర్ మాట్లాడుతూ, భారత జట్టు అస్సలు ఆడకూడదని నేను అనుకుంటున్నాను. భారత్ విషయానికొస్తే ఎక్కడ ఆడినా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ, ఈ మ్యాచ్ అస్సలు ఆడకూడదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
భారత్ ఒమన్, యూఏఈ, పాకిస్తాన్‌లతో పాటు గ్రూప్ ఏలో ఉంది. గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంక ఉన్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడుతుంది.
ప్రశ్నలు లేవనెత్తిన హర్భజన్..
అంతకుముందు, భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్, ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని ఒక ఇంటర్వ్యూలో అన్నారు. పాకిస్తాన్‌కు మనం ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నాం? హర్భజన్ ఇటీవలి వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)లో పాల్గొన్నాడు. అక్కడ భారత ఛాంపియన్ జట్టు గ్రూప్ దశ, సెమీ-ఫైనల్స్ రెండింటిలోనూ పాకిస్తాన్ ఛాంపియన్ జట్టుతో ఆడటానికి నిరాకరించింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, హర్భజన్, ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా, యూసుఫ్ పఠాన్ వంటి అనుభవజ్ఞులతో కూడిన జట్టు ఈ నిర్ణయం తీసుకుంది. దేశమే ముందు ముఖ్యమని, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్థాన్‌తో ఆడటానికి నిరాకరిస్తుందని హర్భజన్ నమ్మకంగా ఉన్నాడు. ఏది ముఖ్యమో, ఏది కాదో వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని హర్భజన్ అన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








