AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. ఇలాంటి రనౌట్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.. దరిద్రం మనోడి నెత్తిమీద నాట్యం

Viral Video: ఈ వింత రనౌట్ చూసిన ప్లేయర్లు అంతా నవ్వుల్లో మునిగిపోయారు. దరిద్రం అంతా బ్యాటర్ నెత్తినే ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. క్యాచ్ మిస్ చేసినా, వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బౌలర్ మాములోడు కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియోలో మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు.

Video: నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. ఇలాంటి రనౌట్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.. దరిద్రం మనోడి నెత్తిమీద నాట్యం
Funny Run Out Video
Venkata Chari
|

Updated on: Aug 18, 2025 | 4:55 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఒకచోట క్రికెట్ కనిపిస్తూనే ఉంటుంది. అంతర్జాతీయ మ్యాచ్‌లైనా కావొచ్చు, లీగ్‌లైనా కావొచ్చు, లేదా లోకల్ మ్యాచ్‌లైనా కావొచ్చు. అయితే, అంతర్జాతీయ మ్యాచ్‌లు వీక్షించేందుకు ఛాన్స్ ఉంటుంది. లోకల్ మ్యాచ్‌లకు లైవ్ సౌకర్యం ఉండదు. దీంతో ఈ లోకల్ మ్యాచ్‌ల్లో జరిగే కొన్ని సన్నివేశాలను మిస్ అవుతుంటాం. లోకల్ మ్యాచ్‌ల్లోనే ఎక్కువగా ఫన్నీ సీన్స్ చోటు చేసుకుంటుంటాయి. వీటిని తర్వాత సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తే, చూసిన వారంతా నవ్వులు మునిగిపోవడం ఖాయం. ఇప్పటికే ఇలాంటి వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో మరో వీడియో చేరింది. అయితే, ఈ వీడియో మాత్రం చాలా స్పెషల్. ఇప్పటి వరకు ఇలాంటి వీడియోను మీరు చూసి ఉండరు. ఇకపైనా ఇలాంటి వీడియోను చూస్తారని చెప్పలేం. అందులో అంత స్పెషల్ ఏముందని ఆలోచిస్తున్నారా.. ఆగండాగండి అక్కడికే వస్తున్నాం..

ఈ వీడియోలో ఓ బౌలర్ బౌలింగ్ చేయడం చూడొచ్చు. అయితే, బ్యాటర్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మిస్సయ్యాడు. బంతి బాగా పైకి లేచింది. ఈ క్రమంలో ఇద్దరు బ్యాటర్లు పరుగు తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పైకి లేచిన బంతిని క్యాచ్ పట్టుకునేందుకు బౌలర్ చాలాసేపు వేచి చూశాడు. కానీ, బంతిని పట్టుకోవడం మిస్ అయ్యాడు. బంతి అతని చేతుల్లోంచి మిస్ అయ్యి, నేరుగా వెళ్లి వికెట్లను తాకింది. దీంతో బ్యాటర్ రనౌట్ అయ్యాడు. అంటే, ఇక్కడ క్యాచ్ ఔట్ కావాల్సిన బ్యాటర్, బౌలర్ క్యాచ్ మిస్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. కానీ, పరుగు పూర్తి చేయడంలో లేట్ చేయడంతో రనౌట్ అయ్యాడన్నమాట.

ఇవి కూడా చదవండి

ఈ వింత రనౌట్ చూసిన ప్లేయర్లు అంతా నవ్వుల్లో మునిగిపోయారు. దరిద్రం అంతా బ్యాటర్ నెత్తినే ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. క్యాచ్ మిస్ చేసినా, వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బౌలర్ మాములోడు కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియోలో మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..