AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ, ICC World Cup 2023 Highlights: ఛేజింగ్‌లో సత్తా చాటిన భారత్.. 4 వికెట్ల తేడాతో విజయం

India vs New Zealand, ICC world Cup 2023 Highlights: 2023 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా 5వ విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 20 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో కివీస్‌పై భారత జట్టు విజయం సాధించింది. అంతకుముందు 2003లో సెంచూరియన్ మైదానంలో కివీస్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

IND vs NZ, ICC World Cup 2023 Highlights: ఛేజింగ్‌లో సత్తా చాటిన భారత్.. 4 వికెట్ల తేడాతో విజయం
India Vs New Zealand, 21st Match
Venkata Chari
|

Updated on: Oct 22, 2023 | 10:24 PM

Share

India vs New Zealand, ICC world Cup 2023 Highlights: 2023 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా 5వ విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 20 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో కివీస్‌పై భారత జట్టు విజయం సాధించింది. అంతకుముందు 2003లో సెంచూరియన్ మైదానంలో కివీస్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఈ విజయంతో భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పుడు 5 మ్యాచ్‌ల తర్వాత టీమిండియా ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ టాప్-4కు చేరుకునే అవకాశాలు మరింత బలపడ్డాయి. ఇప్పుడు ఆ జట్టు 4 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచినా చాలు.

ఆదివారం ధర్మశాల మైదానంలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. 274 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 48 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఛేదించింది. విరాట్ కోహ్లి 104 బంతుల్లో 95 పరుగులతో ఇన్నింగ్స్ ఆడగా, మహ్మద్ షమీ 5 వికెట్లు తీశాడు.

ప్రపంచకప్ 21వ మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌కు 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. నంబర్-4 వద్ద బ్యాటింగ్‌కు వచ్చిన డారిల్ మిచెల్ (130) సెంచరీ ఆడగా, రచిన్ రవీంద్ర (75 పరుగులు) అర్ధ సెంచరీతో రాణించాడు. గ్లెన్ ఫిలిప్స్ 23 పరుగులు చేశాడు. మహ్మద్ షమీ 5 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక్కో వికెట్ సాధించారు.

2023 ప్రపంచకప్‌లో ఈరోజు అతిపెద్ద మ్యాచ్. ఎందుకంటే టోర్నీలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగడమే అందుకు కారణం. ఆ రెండు జట్ల మధ్య పాయింట్ల పట్టికలో స్వల్ప తేడా మాత్రమే ఉంది. భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనుండగా, ఏదో ఒక జట్టు తొలి ఓటమి దక్కనుంది. ఏదో ఒక జట్టు విజయాల పరంపరను కొనసాగించనుంది. టోర్నీలో ఇరు జట్లకు ఇది 5వ మ్యాచ్.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 22 Oct 2023 10:16 PM (IST)

    4 వికెట్ల తేడాతో ఘన విజయం..

    2023 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా 5వ విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 20 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో కివీస్‌పై భారత జట్టు విజయం సాధించింది. అంతకుముందు 2003లో సెంచూరియన్ మైదానంలో కివీస్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

  • 22 Oct 2023 10:10 PM (IST)

    కోహ్లీ ఔట్..

    సెంచరీకి 5 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ పెవిలియన్ చేరాడు. టీమిండియాకు 14 బంతుల్లో 5 పరుగులు కావాలి.

  • 22 Oct 2023 10:00 PM (IST)

    మరో 19 పరుగులు..

    టీమిండియా 46 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 82, రవీంద్ర జడేజా 35 పరుగులతో ఆడుతున్నారు. జడేజాతో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొంది.

  • 22 Oct 2023 09:48 PM (IST)

    హాఫ్ సెంచరీ భాగస్వామ్యం..

    టీమిండియా 43 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 77, రవీంద్ర జడేజా 29 క్రీజులో ఉన్నారు. కోహ్లీ వన్డే కెరీర్‌లో 69వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొంది.

  • 22 Oct 2023 09:32 PM (IST)

    39 ఓవర్లకు..

    39 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు సాధించింది. కోహ్లీ 70, జడేజా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయానకిి మరో 66 బంతుల్లో 52 పరుగులు కావాలి.

  • 22 Oct 2023 09:08 PM (IST)

    సూర్య రనౌట్..

    తొలి మ్యాచ్‌ ఆడుతోన్న సూర్య కుమార్ యాదవ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి, రనౌట్‌గా వెనుదిరిగాడు.

  • 22 Oct 2023 09:06 PM (IST)

    ప్రపంచ కప్‌లలో అత్యధిక 50-ప్లస్ స్కోర్లు నమోదు చేసిన ప్లేయర్లు..

    21 – సచిన్ టెండూల్కర్

    12 – కుమార సంగక్కర

    12 – షకీబ్ అల్ హసన్

    12 – విరాట్ కోహ్లీ

  • 22 Oct 2023 09:05 PM (IST)

    కోహ్లీ హాఫ్ సెంచరీ..

    కీలక ఇన్నింగ్స్ ఆడుతోన్న విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు.

  • 22 Oct 2023 08:44 PM (IST)

    కీలక భాగస్వామ్యం..

    టీమిండియా 30 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు. కోహ్లి 69వ అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్నాడు.

  • 22 Oct 2023 08:13 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన భారత్..

    శ్రేయాస్ అయ్యర్ 33 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ట్రెండ్ బోల్డ్ పెవిలియన్ చేర్చాడు. దీంతో టీమిండియా 21.3 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది.

  • 22 Oct 2023 07:50 PM (IST)

    మొదలైన మ్యాచ్..

    భారీగా మంచు కురవడంతో మ్యాచ్‌ను కొద్దిసేపు ఆపారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో మ్యాచ్‌ను మొదలుపెట్టారు.

  • 22 Oct 2023 07:43 PM (IST)

    ఆగిన మ్యాచ్..

    బ్యాడ్ వెదర్ కారణంగా మ్యాచ్ ఆగింది. దీంతో 15.4 ఓవర్లు ముగిసే వరకు టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. రోహిత్ 46, గిల్ 26 పరుగులతో పెవిలియన్ చేరారు. కోహ్లీ 7, శ్రేయాస్ 21 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • 22 Oct 2023 07:28 PM (IST)

    గిల్ ఔట్..

    రోహిత్ పెవిలియన్ చేరిన వెంటనే, గిల్ (26) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 13.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది.

  • 22 Oct 2023 07:20 PM (IST)

    రోహిత్ ఔట్..

    రోహిత్ శర్మ (46) మరోసారి హాఫ్ సెంచరీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో 71 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ను కోల్పోయింది.

  • 22 Oct 2023 07:16 PM (IST)

    పవర్ ప్లే ముగిసే సరికి..

    పవర్ ప్లే ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 63 పరుగులు సాధించింది. రోహిత్ 39, గిల్ 24 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • 22 Oct 2023 06:46 PM (IST)

    3 ఓవర్లకు భారత్ స్కోర్..

    3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 22 పరుగులు చేసింది. రోహిత్ 19, గిల్ 3 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • 22 Oct 2023 06:36 PM (IST)

    మొదలైన టీమిండియా టార్గెట్..

    274 పరుగుల టార్గెట్‌తో టీమిండియా ఛేజింగ్ మొదలుపెట్టింది. రోహిత్, గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు.

  • 22 Oct 2023 06:03 PM (IST)

    టీమిండియా టార్గెట్ 274

    టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ముందు 274 పరుగుల టార్గెట్ నిలిచింది.

  • 22 Oct 2023 06:01 PM (IST)

    షమీ ఖాతాలో 5 వికెట్లు..

    ప్రపంచకప్ 2023లో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా షమీ నిలిచాడు.

  • 22 Oct 2023 05:51 PM (IST)

    రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు..

    షమీ 48 ఓవర్లో 4,5 బంతుల్లో వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో న్యూజిలాండ్ టీం వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయింది.

  • 22 Oct 2023 05:49 PM (IST)

    7 వికెట్లు డౌన్..

    47.4 ఓవర్లకు న్యూజిలాండ్ టీం 7 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. మిచెల్ 118తో క్రీజులో నిలిచాడు.

  • 22 Oct 2023 05:25 PM (IST)

    43 ఓవర్లకు..

    43 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం 232 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది.

  • 22 Oct 2023 04:57 PM (IST)

    4వ వికెట్ డౌన్..

    36.4 ఓవర్లో లాంథమ్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో 205 పరుగుల వద్ద కివీస్ టీం 4వ వికెట్‌ను కోల్పోయింది.

  • 22 Oct 2023 04:39 PM (IST)

    ఎట్టకేలకు వికెట్..

    భారత బౌలర్లు ఎట్టకేలకు డేంజరస్ జోడీని విడగొట్టారు. షమీ బౌలింగ్‌లో రచిన్ 75 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో న్యూజిలాండ్ 178 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయింది.

  • 22 Oct 2023 04:23 PM (IST)

    31 ఓవర్లకు కివీస్ స్కోర్..

    31 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం 2 వికెట్లు కోల్పోయి 160 పరుగులు సాధించింది. రవీంద్ర, మిచెల్ జోడీ 145 పరుగుల భాగస్వామ్యంతో డేంజర్‌గా మారింది.

  • 22 Oct 2023 03:53 PM (IST)

    100 పరుగుల భాగస్వామ్యం..

    రచిన్ రవీంద్ర (56), మిచెల్ (41) జోడీ 100 పరుగుల భాగస్వామ్యంతో కీలక భాగస్వామ్యంతో దూసుకపోతున్నారు. దీంతో కివీస్ టీం 23 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు సాధించింది.

  • 22 Oct 2023 03:22 PM (IST)

    16 ఓవర్లకు కివీస్ స్కోర్..

    16 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయి 65 పరుగులు సాధించింది. రవీంద్ర 28, మిచెల్ 14 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • 22 Oct 2023 03:21 PM (IST)

    తిరిగొచ్చిన రోహిత్..

    టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చింది. గాయంతో మైదానం వీడిన రోహిత్ మైదానంలోకి తిరిగొచ్చాడు.

  • 22 Oct 2023 02:58 PM (IST)

    గాయంతో మైదానం వీడిన రోహిత్..

    బాల్ ఆపే క్రమంలో రోహిత్ శర్మకు గాయమైంది. దీంతో వెంటనే మైదానం వీడాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు.

  • 22 Oct 2023 02:46 PM (IST)

    ప్రపంచ కప్‌లలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..

    44 – జహీర్ ఖాన్

    44 – జవగల్ శ్రీనాథ్

    32* – మహ్మద్ షమీ

    31 – అనిల్ కుంబ్లే

  • 22 Oct 2023 02:44 PM (IST)

    షమీ దెబ్బకు రెండో వికెట్ డౌన్..

    ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతోన్న షమీ.. తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. దీంతో విల్ యంగ్ (17) 8.1 ఓవర్లో టీం స్కోర్ 19 వద్ద పెవిలియన్ చేరాడు.

  • 22 Oct 2023 02:20 PM (IST)

    తొలి వికెట్ డౌన్..

    డేవాన్ కాన్వే (0) ఖాతా ఓపెన్ చేయకుండానే.. సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో కివీస్ టీం 9 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

  • 22 Oct 2023 01:44 PM (IST)

    ఇరు జట్లు

    భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

    న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

  • 22 Oct 2023 01:34 PM (IST)

    IND vs NZ: టాస్ గెలిచిన రోహిత్..

    టాస్ గెలిచిన రోహిత్.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

  • 22 Oct 2023 01:00 PM (IST)

    సూర్యకుమార్-షమీ ఆడడం ఖాయం..

    న్యూజిలాండ్‌తో సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ ఆడటం ఖాయమైంది. నిన్న ప్రాక్టీస్‌లో సూర్యకుమార్ మణికట్టుకు బంతి తగిలినా అతను మ్యాచ్‌కు ఫిట్‌గా ఉన్నాడని వార్తలు వచ్చాయి.

  • 22 Oct 2023 12:38 PM (IST)

    స్టేడియానికి చేరుకున్న న్యూజిలాండ్ జట్టు

    న్యూజిలాండ్ జట్టు స్టేడియానికి చేరుకోగా మరికొద్దిసేపట్లో టీమ్ ఇండియా కూడా స్టేడియానికి చేరుకోనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు టాస్‌ జరుగుతుంది.

  • 22 Oct 2023 12:31 PM (IST)

    ధర్మశాలలో వాతావరణం..

    గత మ్యాచ్‌లో వర్షం కారణంగా ఓవర్లు తగ్గించిన ధర్మశాలలో నేడు భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి కూడా మధ్యాహ్నం వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. 43 శాతం వర్షం కురవొచ్చని వెదర్ రిపోర్ట్ తెలియజేస్తుంది. సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది.

  • 22 Oct 2023 12:28 PM (IST)

    ప్రపంచ కప్ 2023లో ఇప్పటివరకు భారత్-న్యూజిలాండ్ ప్రదర్శన

    2023 ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు అజేయంగా ముందుకు సాగుతున్నాయి. ఇరు జట్లకు ఇది 5వ మ్యాచ్. అంటే ఇంతకు ముందు ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ గెలిచి 8 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. ఈ రెండూ పాయింట్ల పట్టికలో మొదటి రెండు జట్లు, మెరుగైన రన్ రేట్ ఆధారంగా, న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండవ స్థానంలో ఉంది.

Published On - Oct 22,2023 12:27 PM