IND vs NZ 2nd Test: గాయం కారణంగా కివీస్‌తో జరిగే ముంబై టెస్ట్‌కు దూరమైన కీలక ఆటగాళ్లు.. ఎవరెవరంటే..
ముంబయిలో న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో టెస్టులో ముగ్గురు భారత ఆటగాళ్లు గాయాలతో తప్పుకున్నారు. అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ గాయం కారణంగా టెస్ట్‌కు దూరమయ్యారని బీసీసీఐ ప్రకటించింది...
ముంబయిలో న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో టెస్టులో ముగ్గురు భారత ఆటగాళ్లు గాయాలతో తప్పుకున్నారు. అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ గాయం కారణంగా టెస్ట్‌కు దూరమయ్యారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం మ్యాచ్‌కు ముందు ప్రకటించింది. “కాన్పూర్‌లో జరిగిన 1వ టెస్టు మ్యాచ్ చివరి రోజు సమయంలో ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఎడమ చిటికెన వేలికి గాయమైంది. దీంతో అతను ముంబైలో జరిగే 2వ టెస్టుకు దూరమయ్యాడు. బీసీసీఐ వైద్య బృందం అతని పురోగతిని పర్యవేక్షిస్తూనే ఉంటుంది” అని బీసీసీఐ పేర్కొంది.
“కాన్పూర్‌లో జరిగిన 1వ టెస్టు మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కుడి మోచేతికి గాయమైంది. స్కాన్ చేసిన తర్వాత, అతని మోచేయి వాపు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతనికి విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ముంబైలో జరిగిన 2వ టెస్ట్‌కు దూరమయ్యాడు. “కాన్పూర్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ చివరి రోజు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అజింక్యా రహానే ఎడమ స్నాయువు స్ట్రెయిన్‌కు గురయ్యాడు. అతను పూర్తిగా కోలుకోనందున, అతను ముంబైలో జరిగిన 2వ టెస్ట్‌కు దూరంగా ఉన్నాడు. అతని పురోగతిని నిశితంగా పరిశీలిస్తున్నామని BCCI వైద్య బృందం. తెలిపింది.”
కాగా, ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో శుక్రవారం ఉదయం ముంబైలో జరగాల్సిన మ్యాచ్ ఆలస్యమైంది. మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గాయం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. అతనికి ఎడమ-మోచేయి గాయమైంది. విలియమ్సన్ గైర్హాజరీలో టామ్ లాథమ్ ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు నాయకత్వం వహించనున్నాడు.
Read Also.. Hardik Pandya : ముంబయి ఇండియన్స్ ఎప్పటికీ నా హృదయంలో నిలిచి ఉంటుంది.. హార్దిక్ ఎమోషనల్ వీడియో..