IND vs NZ, 2nd Test, Day 1 Highlights: ముగిసిన తొలిరోజు.. భారత స్కోర్ 221/4.. సెంచరీతో ఆకట్టుకున్న మయాంక్
IND vs NZ, 2nd Test, Day 1 Highlights: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఆటలో తొలిరోజు పూర్తయింది. 70 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయిన భారత్ 221 పరుగులు సాధించింది. క్రీజులో మయాంక్ అగర్వాల్, సాహా ఉన్నారు.
IND vs NZ, 2nd Test, Day 1 Highlights: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఆటలో తొలిరోజు పూర్తయింది. 70 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయిన భారత్ 221 పరుగులు సాధించింది. క్రీజులో మయాంక్ అగర్వాల్(120 పరుగులు, 246 బంతులు, 14 ఫోర్లు, 4 సిక్సులు), సాహా(25 పరుగులు, 53 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నారు. శుభ్మన్ గిల్ 44, పుజరా 0, విరాట్ కోహ్లీ 0, శ్రేయాస్ అయ్యర్ 18 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఒక్కడే 4 వికెట్లు పడగొట్టాడు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌కు సర్వసిద్ధమైంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే గత రెండు రోజులుగా ముంబయిలో కురుస్తున్న వర్షాల కారణంగా మ్యాచ్‌పై నీలి మేఘాలు అలుముకున్నాయి. వర్షాల కారణంగా వాంఖడే పిచ్ ఔట్‌ఫీల్డ్ తడిగా మారింది. దీంతో మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు టాస్ ప్రక్రియను ఆలస్యం చేశారు. మరి కాసేపట్లో మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదిలా ఉంటే ఇండియా, న్యూజిలాండ్‌ల మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. దీంతో రెండో టెస్ట్‌పై ఇరు జట్లు ఆశలు పెట్టుకున్నాయి. ఈ మ్యాచ్‌ను ఎలాగైనా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి. ఇక ముంబయిలో వర్షం కారణంగా రెండు జట్లు ప్రాక్టిస్ చేయలేకపోయాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం టెస్ట్ ర్యాంకిగ్స్‌లో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. ఇలా రెండు హేమాహేమీ జట్ల మధ్య జరుగుతోన్న ఈ మ్యాచ్‌పై సర్వత్ర ఉత్కంఠనెలకొంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
LIVE Cricket Score & Updates
-
ముగిసిన తొలిరోజు..
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఆటలో తొలిరోజు పూర్తయింది. 70 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయిన భారత్ 221 పరుగులు సాధించింది. క్రీజులో మయాంక్ అగర్వాల్(120 పరుగులు, 246 బంతులు, 14 ఫోర్లు, 4 సిక్సులు), సాహా(25 పరుగులు, 53 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నారు. శుభ్మన్ గిల్ 44, పుజరా 0, విరాట్ కోహ్లీ 0, శ్రేయాస్ అయ్యర్ 18 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఒక్కడే 4 వికెట్లు పడగొట్టాడు.
-
200 దాటిన భారత స్కోర్..
టీమిండియా స్కోర్ 200 పరుగులు దాటింది. మూడో సెషన్‌లో ప్రస్తుతం టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. 70 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 221 పరుగులు సాధించింది. మయాంక్ అగర్వాల్ 120 పరుగులతో(246 బంతులు, 14 ఫోర్లు, 4 సిక్సులు) దూసుకెళ్తున్నాడు. సాహా (25 పరుగులు, 53 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా అగర్వాల్‌కు అండగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
-
-
టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తి చేసిన మయాంక్..
ముంబై టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్(100 పరుగులు, 198 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. తన అద్భుత ఇన్నింగ్స్‌తో 96 పరుగులతో వద్ద ఉన్నప్పుడు ఫోర్ కొట్టి సెంచరీ చేశాడు. దీంతో టెస్టుల్లో తన నాలుగో శతకాన్ని పూర్తి చేశాడు. ప్రస్తుతం టీమిండియా 59 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు సాధించింది.
-
సెంచరీకి చేరువైన మయాంక్..
టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్(95) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఓవైపు వికెట్లు పడుతోన్న తన సూపర్ ఇన్నింగ్స్‌తో పోరాడే స్కోర్ దిశగా టీమిండియాను తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసిన భారత్.. భారీ స్కోర్ సాధించే దిశగా సాగుతోంది.
-
శ్రేయాస్ అయ్యర్ ఔట్..
శ్రేయాస్ అయ్యర్ (18) రూపంలో టీమిండియా నాలుగో వికెట్‌ను కోల్పోయింది. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో టామ్ బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలయన్ చేరాడు. 160 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్‌ను చేజార్చుకుంది.
-
-
బౌండరీల మోత..
మయాంక్ అగర్వాల్(77), శ్రేయాస్ అయ్యర్(13) బౌండరీల మోత మోగిస్తున్నారు. ఇప్పటి వరకు వీరిద్దరు కలిపి 11 ఫోర్లు, 3 సిక్సులు బాదేశారు. టీమిండియా 46 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 147 పరుగులు సాధించింది.
-
ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువసార్లు డకౌట్ అయిన టీమిండియా కెప్టెన్‌లు
4 బిషన్ బేడీ 1976లో 4 1983లో కపిల్ దేవ్ 4 2011లో MS ధోని 4 విరాట్ కోహ్లీ 2021*
-
టెస్టు కెప్టెన్‌గా ఎక్కువసార్టు డకౌట్‌లు..
13 స్టీఫెన్ ఫ్లెమింగ్ 10 గ్రేమ్ స్మిత్ 10 విరాట్ కోహ్లీ* 8 అథర్టన్/ క్రోంజే/ ధోని
-
మయాంక్ అగర్వాల్ అర్థ సెంచరీ..
టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (52 పరుగులు, 121 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సులు) తన సూపర్ ఇన్నింగ్స్‌తో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. తను మాత్రం క్లాసిక్ ఇన్నింగ్స్‌తో దూసుకపోతున్నాడు. టీ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు సాధించింది. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ 3 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు.
-
కష్టాల్లో టీమిండియా..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలుత బాగానే ఆడినా.. శుభ్‌మన్ వికెట్‌తో కష్టాల్లోకి కూరుకుపోతోంది. వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. అందరి ఆశలను నిరాశపరుస్తూ కెప్టెన్ కోహ్లీ డకౌట్ అయ్యాడు.
-
పూజారా డకౌట్..
టీమిండియాకు వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. శుభ్‌మన్ గిల్ అవుట్ అయిన వెంటనే క్రీజులోకి వచ్చిన పూజారా డకౌట్ అయ్యాడు. అజాజ్ పటేల్ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా స్కోరు బోర్డ్ వేగం నెమ్మదించింది. మరి బరిలోకి దిగిన కెప్టెన్ ఏం చేస్తాడో చూడాలి.
-
టీమిండియాకు తొలి ఎదురుదెబ్బ..
మంచి ఆరంభం ఇచ్చిన శుభ్‌మన్ గిల్, మయాంక్‌ల జోడిని అజాజ్ పటేల్ విడగొట్టాడు. 44 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ రాస్ టేయిలర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో 80 పరుగుల పాట్నర్‌షిప్‌కు బ్రేక్ పడింది. కేవలం 6 పరుగలతో శుభ్‌మన్ హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ప్రస్తుతం భారత స్కోరు ఒక వికెట్ నష్టానికి 80 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో మయాంక్ అగర్వాల్ (32), పూజారా (0) కొనసాగుతున్నారు.
-
21 ఓవర్లకు టీమిండియా స్కోర్ ఎంతంటే..
టీమిండియా ఓపెనర్లు ఓవైపు వికెట్ కాపాడుకుంటూ మరోవైపు జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే 21 ఓవర్లకు ఒక్క వికెట్ నష్టపోకుండా 63 పరుగులు సాధించారు. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్ (29), శుభ్‌మన్ గిల్ (34) పరుగులతో కొనసాగుతున్నారు. మూడు రన్‌రేట్‌తో టీమిండియా స్కోర్ బోర్డ్ పరుగులు పెడుతోంది.
-
10 ఓవర్లకు భారత్ స్కోర్ ఎంతంటే..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మంచి శుభారంభాన్ని ప్రారంభించింది. మొదటి నుంచి టీమిండియా ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలో 10 ఓవర్లకు గాను జట్టు ఒక్క వికెట్ కోల్పోకుండా 29 పరగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (14), మయాంక్ అగర్వాల్ (15) పరుగులతో కొనసాగుతున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.
-
టాస్ గెలిచిన టీమిండియా..
భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. అవుట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. ఇక టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మరి టీమిండియా సారథి తీసుకున్న ఈ నిర్ణయం జట్టుకు ఏమేర మేలు చేస్తుందో చూడాలి. మ్యాచ్ 12:00 గంటలకు ప్రారంభంకానుంది.
-
మ్యాచ్ సమయంలో మార్పులు..
వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభంకానున్న మ్యాచ్ సమయాల్లో పలు మార్పులు చేశారు. ఆలస్యం కావడంతో ప్లేయర్స్ ముందుగానే భోజనం విరామం తీసుకున్నారు. ఈ కారణంగా మొదటి సెషన్ 12 గంటల నుంచి 2:40 గంటల వరకు, రెండో సెషన్ 3:00 నుంచి 5:30 వరకు జరగనుంది. టీ విరామం 2:40 గంటల నుంచి 3:00 గంటల మధ్య ఉండనుంది.
-
మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్..
అవుట్ ఫీల్డ్‌ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 11:30 గంటలకు టాస్ వేసి, 12 గంటలలోపు రెండో టెస్ట్ మ్యాచ్‌ను ప్రారంభించనున్నట్లు అంపైర్లు తెలిపారు.
-
న్యూజిలాండ్ ఆటగాడు కూడా మ్యాచ్‌కు దూరం..
మోచేయి గాయం కారణంతో న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్స్ రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో టామ్ లేథమ్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు.
Team News | BLACKCAPS captain Kane Williamson will miss the second and final Test against India in Mumbai as he continues to battle the left-elbow injury which has troubled him for much of 2021. More | https://t.co/VClIKxKI8Q #INDvNZ pic.twitter.com/wGeA46LN4g
— BLACKCAPS (@BLACKCAPS) December 3, 2021
-
బరిలోకి దిగనున్న టీమిండియా కెప్టెన్..
టీ20 వరల్డ్ కప్ తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ ముంబయిల వేదికగా జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. వాంఖడే స్టేడియంలో చివరి సారి 2016లో టెస్ట్ మ్యాచ్ ఆడిన కోహ్లీ 235 పరుగులు సాధించాడు. దీంతో తనకు అచ్చొచ్చిన స్టేడియంలో మరోసారి కోహ్లీ వండర్స్ క్రియేట్ చేయనున్నాడని ఆయన అభిమానులు ఆశతో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కోహ్లీ కెప్టెన్‌గా 41 సెంచరీలతో ఉన్నాడు. ఇది ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో సమానం.. దీంతో ఇప్పుడు ముంబయి వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తే మరో అరుదైన రికార్డు సృష్టించిన వాడవుతాడు. మరి కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఈ అద్భుతాన్ని సాధిస్తాడో చూడాలి.
-
వాంఖడే స్టేడియం చేరుకున్న టీమిండియా ప్లేయర్స్…
రెండో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయర్స్ కాసేపటి క్రితమే వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు. అయితే వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో అంపైర్లు ఆలస్యంగా ఉండనున్నట్లు ప్రకటించారు. మరోసారి 10:30 గంటలకు మైదానాన్ని పరిశీలించిన తర్వాత అంపైర్లు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
Hello & good morning from Mumbai for the second @Paytm #INDvNZ Test! ?#TeamIndia pic.twitter.com/Pvkm9F2WbG
— BCCI (@BCCI) December 3, 2021
-
ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ దూరం..
టీమిండియాకు రెండో టెస్ట్‌లో గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి. ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మ్యాచ్‌కు దూరం కానున్నారు. వీరు ముగ్గురు గాయం కారణంగా మ్యాచ్‌లో ఆడడం లేదు.
NEWS – Injury updates – New Zealand’s Tour of India
Ishant Sharma, Ajinkya Rahane and Ravindra Jadeja ruled out of the 2nd Test.
More details here – https://t.co/ui9RXK1Vux #INDvNZ pic.twitter.com/qdWDPp0MIz
— BCCI (@BCCI) December 3, 2021
-
ఇరు జట్ల సభ్యులు.. (అంచనా)
భారత్: శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, పుజారా, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సాహా, రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, సిరాజ్, ఉమేశ్ యాదవ్. న్యూజిలాండ్: విల్ యంగ్, లేథమ్, విలియమ్సన్, రాస్ టేలర్, నికోల్స్, బ్లండెల్, రచిన్ రవీంద్ర, జేమీసన్, సౌథీ, వాగ్నర్, అజాజ్ పటేల్.
Published On - Dec 03,2021 10:06 AM