IPL 2022 Retention: కొత్త జట్ల కెప్టెన్సీ రేసులో డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్.. బలమేంటి.. బలహీనతలేంటి..
జనవరిలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం కోసం సన్నాహాలు ప్రారంభించింది బీసీసీఐ. అహ్మదాబాద్, లక్నో రెండు కొత్త ఫ్రాంచైజీల రాకతో జట్ల సంఖ్య పదికి పెరిగింది...
జనవరిలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం కోసం సన్నాహాలు ప్రారంభించింది బీసీసీఐ. అహ్మదాబాద్, లక్నో రెండు కొత్త ఫ్రాంచైజీల రాకతో జట్ల సంఖ్య పదికి పెరిగింది. ఇప్పటికే ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. అయితే గరిష్ఠంగా నలుగురిని మాత్రమే రిటెన్షన్ చేసుకునే అవకాశం ఉంది. ఆ నలుగురిలో ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీయులు ఉండొచ్చు. లేదా ముగ్గురు భారతీయులు(ఇద్దరు అన్క్యాప్డ్ ఆటగాళ్లు), ఒక విదేశీయుడు ఉండవచ్చు. రిటెన్షన్ ప్రక్రియ ముగియడంతో రెండు కొత్త జట్లు వేలం పూల్ నుంచి ముగ్గురు ఆటగాళ్ల చొప్పున ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంది. అందులో ఇద్దరు భారతీయులు, ఒక విదేశీయుడు ఉండాలి. రెండు కొత్త జట్లు తమకు కావలసిన ఆటగాడిని సంప్రదించి ఆర్థిక ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు.
డేవిడ్ వార్నర్
ఐపీఎల్ 2021 మొదటి అర్ధభాగంలో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎస్హెచ్ఆర్ తొలగించింది. కేన్ విలియమ్సన్‌కు పగ్గాలను అప్పగించింది. వార్నర్ పేలవమైన ఫామ్ ఫలితంగా ప్లేయింగ్ XI నుంచి చోటు దక్కించుకోలేదు. దీంతో వార్నర్, SRH మేనేజ్‌మెంట్ మధ్య సంబంధాలు క్షీణించాయి. చివరికి వార్నర్‌ను 2022 సంవత్సరానికి కొనసాగించకూడదని మేనేజ్‌మెంట్ నిర్ణయించుకుంది. కానీ టీ20 వరల్డ్ కప్‌లో వార్నర్ అద్భుతంగా రాణించాడు.
అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ వార్నర్ రిటైన్ చేసుకోలేదు. దీంతో అతను వేలం పూల్‌లోకి వచ్చాడు. వార్నర్‌ను మైదానంలో అత్యుత్తమ వ్యూహాత్మక కెప్టెన్‌గా పరిగణిస్తారు. అతడిని రెండు కొత్త ఫ్రాంచైజీల్లో ఒక ఫ్రాంచైజీ తీసుకునే అవకాశం ఉంది.వార్నర్ దూకుడు, వ్యూహాత్మక కెప్టెన్సీ అతన్ని కొత్త జట్ల కెప్టెన్సీకి తీవ్రమైన పోటీదారుగా చేస్తుంది. వార్నర్ కెప్టెన్సీ రికార్డులు కూడా ఆకట్టుకున్నాయి. అతను SRHకు 2016లో టైటిల్ అందించాడు. ఆ తర్వాతి సంవత్సరంలో ప్లేఆఫ్‌కు తీసుకెళ్లాడంలో కీలక పాత్ర పోషించాడు.
కేఎల్ రాహుల్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌ను ఈసారి పంజాబ్ రిటైన్ చేసుకోలేదు. అతను వేలానికి వెళ్లడాని ఇష్టపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపారు. రాహుల్ ఆ జట్టు తరఫున మంచి ప్రదర్శన చేశాడు. కానీ జట్టుకు సరైన విజయాలను అందించలేకపోయాడు. ఆటగాడిగా విజయం సాధించినా కెప్టెన్‌గా విఫమయ్యాడు. అతను వేలం పూల్‌లోకి రావడంతో అతడిని దక్కించుకోవడానికి రెండు కొత్త జట్లు ప్రయత్నం చేయవచ్చు.
Read Also.. IND vs NZ 2nd Test: గాయం కారణంగా కివీస్‌తో జరిగే ముంబై టెస్ట్‌కు దూరమైన కీలక ఆటగాళ్లు.. ఎవరెవరంటే..