AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ 3rd ODI Playing 11: పంత్ లేదా శాంసన్.. కీలక వన్డేలో టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..

IND Vs NZ Match Prediction Squads: మూడో మ్యాచ్ భారత జట్టుకు చాలా ముఖ్యమైనది . ఎందుకంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతే సిరీస్‌ను కోల్పోతుంది.

IND vs NZ 3rd ODI Playing 11: పంత్ లేదా శాంసన్.. కీలక వన్డేలో టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..
Ind Vs Nz 3rd Odi Playing 11
Venkata Chari
|

Updated on: Nov 29, 2022 | 7:20 PM

Share

భారత క్రికెట్ జట్టు బుధవారం న్యూజిలాండ్‌తో మూడో వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కాపాడుకోవడమే టీమ్‌ఇండియా ప్రయత్నంగా నిలవనుంది. రెండో వన్డే తర్వాత సిరీస్‌ గెలిచే అవకాశం భారత్ చేతుల్లోంచి పోయింది. ఎందుకంటే హామిల్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తి కాలేదు. తొలి మ్యాచ్‌లో నెగ్గిన న్యూజిలాండ్ సిరీస్‌లో ముందంజ వేసింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగే మూడో వన్డేలో భారత్ గెలిస్తే సిరీస్ 1-1తో సమం అవుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తరపున ప్లేయింగ్-11లో ఎవరు చోటు దక్కించుకుంటారనే దానిపై అనేక ప్రశ్నలు ఉన్నాయి.

ఈ పర్యటనలో వన్డే జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తన కెప్టెన్సీలో జట్టును ఓటమి నుంచి తప్పించడం ధావన్ బాధ్యతగా మారింది. అదే సమయంలో ఈ టూర్‌లో ఉన్న జట్టు కోచ్‌ వీవీఎస్‌ ధావన్‌ ముందున్న సవాల్‌. సిరీస్ ఓటమి నుంచి భారత్‌ను కాపాడేందుకు లక్ష్మణ్ కూడా తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. అయితే, వర్షం పడితే, మ్యాచ్ రద్దు అవుతుంది. ఈ పరిస్థితి భారత్‌కు మంచిది కాదు.

ఇవి కూడా చదవండి

పంత్‌ను ప్లేయింగ్ 11 నుంచి ఔట్..

రెండో మ్యాచ్‌లో ప్లేయింగ్-11లో భారత్ మార్పులు చేసింది. జట్టు ఆరవ బౌలింగ్ ఎంపికను కలిగి ఉంది. దీపక్ హుడాను ఎంపిక చేసింది. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ సంజూ శాంసన్‌ను తొలగించి, హుడాను తీసుకొచ్చింది. అలాగే రిషబ్ పంత్‌ను కొనసాగించడంతో జట్టు విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. పంత్ నిరంతరం విఫలమవుతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో జట్టు అతనికి నిరంతరం అవకాశాలు ఇస్తోంది. అయితే శాంసన్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. శాంసన్ జట్టు నుంచి పదే పదే బయటికి పంపించస్తున్నారు.

ఇప్పుడు రెండో వన్డేలో ధావన్ ప్లేయింగ్-11లో మార్పులు చేసేందుకు అవకాశం ఉంది. పంత్‌ను తప్పించి శాంసన్‌కు అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి. శాంసన్ తొలి వన్డేలో 36 పరుగులు చేశాడు.

న్యూజిలాండ్ జట్టులో మార్పు ఉంటుందా?

రెండో ODIలో న్యూజిలాండ్ ఆడమ్ మిల్నే స్థానంలో మిచెల్ బ్రేస్‌వెల్‌ను ప్లేయింగ్-11లో చేర్చుకుంది. మరి మూడో వన్డేలో ఆడతాడో లేదో చూడాలి. లేదా న్యూజిలాండ్ జట్టు తొలి వన్డే మాదిరిగానే నలుగురు ఫాస్ట్ బౌలర్లతో వెళ్లాలని అనుకుంటే మాత్రం ఎటువంటి మార్పులు ఉండవు.

రెండు జట్లు..

టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 – శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్) / సంజు శాంసన్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

న్యూజిలాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 – కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, డారెల్ మిచెల్, టామ్ లాథమ్ (కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మిచెల్ బ్రేస్‌వెల్/ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..