IND vs NED: నెదర్లాండ్స్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే.. తొలిసారి ఢీకొడుతోన్న టీమిండియా.. ప్లేయింగ్ XI ఎలా ఉందంటే?
IND Vs NED Probable Playing XI: ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లలో, నెదర్లాండ్స్ UAE, నమీబియాలను ఓడించి మూడు గేమ్‌లలో రెండు గెలిచింది. గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన నమీబియా జట్టు..
టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు తన రెండో మ్యాచ్‌లో నేడు అంటే అక్టోబర్ 27న నెదర్లాండ్స్‌తో తలపడనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. అదే సమయంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఓడిపోయింది. ఇప్పటి వరకు భారత్, నెదర్లాండ్స్ మధ్య ఒక్క టీ20 మ్యాచ్ కూడా జరగలేదు.
టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు?
ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లలో, నెదర్లాండ్స్ UAE, నమీబియాలను ఓడించి మూడు గేమ్‌లలో రెండు గెలిచింది. గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన నమీబియా జట్టు.. పెద్ద జట్లకు కూడా ఝలక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రూప్ దశలో బంగ్లాదేశ్‌పై నెదర్లాండ్స్ బౌలర్లు బంగ్లాదేశ్‌ను 20 ఓవర్లలో 144 పరుగులకే పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కేవలం 9 పరుగుల తేడాతో గెలిచింది.
సిడ్నీ క్రికెట్ స్టేడియం పిచ్ గురించి మాట్లాడితే..
సిడ్నీ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు సహాయకరంగా పరిగణిస్తుంటారు. ఇక్కడ జరిగిన మ్యాచ్‌లు అత్యధిక స్కోరింగ్‌గా ఉన్నాయి. ఇక్కడ బ్యాటర్లు వేగం, బౌన్స్ రెండింటినీ పొందుతారు. దీని కారణంగా బంతి సరిగ్గా బ్యాట్‌ను తాకుతుంది. ఇక బౌలింగ్ గురించి చెప్పాలంటే ఈ పిచ్ స్పిన్నర్లకు కాస్త సహయం అందించనుంది.
ఈ స్టేడియంలో చివరి మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 22 న జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 200 పరుగులు చేసింది. ఈ గడ్డపై ఛేజింగ్ పరంగా టీమిండియాకు మంచి రికార్డు ఉంది. 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా విజయం సాధించింది.
వాతావరణం ఎలా ఉంటుంది?
టీమిండియా రెండో మ్యాచ్‌లో వర్షం కురిసే అవకాశం లేదు. ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇది సాయంత్రం అనుకూలమైన ఉష్ణోగ్రతగా ఉంటుంది. 10% వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే, గత కొన్ని రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉండడంతో ఇప్పుడు ఇరు జట్లకు కాస్త ఆందోళన కలుగుతోంది.
ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.00 గంటలకు భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.
భారత్ vs నెదర్లాండ్స్ మ్యాచ్‌కు ముందు బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే పెద్ద అప్‌డేట్ ఇచ్చారు. నెదర్లాండ్స్‌తో జరిగే భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పు ఉంటుందా అనే ప్రశ్నకు అతను స్పందిస్తూ.. నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పుకు అవకాశం లేదు. అలాగే ఎవరికీ విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచన కూడా లేదంటూ తేల్చేశాడు.
ఇరు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ XI..
ఇండియా – రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.
నెదర్లాండ్స్ – మాక్స్ ఆడ్, విక్రమ్‌జిత్ సింగ్, బాస్ డి లీడ్, టామ్ కూపర్, కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, టిమ్ ప్రింగిల్, టిమ్ వాన్ డెర్ గుటెన్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్.